నోముల అంత్యక్రియలు పూర్తి.. గంటపాటు కేసీఆర్ అక్కడే..

ABN , First Publish Date - 2020-12-03T18:47:38+05:30 IST

నోముల నర్సింహయ్య అంతిమయాత్ర అనంతరం అంత్యక్రియలు ముగిసాయి.

నోముల అంత్యక్రియలు పూర్తి.. గంటపాటు కేసీఆర్ అక్కడే..

నల్లగొండ: అనారోగ్యంతో కన్నుమూసిన నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అంతిమయాత్ర అనంతరం అంత్యక్రియలు ముగిసాయి. నోముల స్వగ్రామం పాలెంలోని వ్యవసాయ క్షేతంలో ప్రభుత్వ లాంఛనాల ప్రకారం ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. నోముల నర్సింహయ్య అంత్యక్రియల్లో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. గంటపాటు అక్కడే ఉన్నారు.


గురువారం ఉదయం 10:50 గంటలకు సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ నుంచి బేగంపేట చేరుకుని హెలికాప్టర్‌లో పాలెం గ్రామానికి చేరుకున్నారు. నోముల నర్సింహయ్య అంత్యక్రియల్లో పాల్గొని.. కుటుంబ సభ్యులను ఓదార్చారు. అంత్యక్రియల అనంతరం తిరిగి హైదరాబాద్‌కు ప్రయాణమయ్యారు. 


అంతకుముందు గురువారం ఉదయం నకిరేకల్‌లో నోముల నర్సింహయ్య అంతిమయాత్ర ప్రారంభమైంది. మెయిన్ రోడ్ నుంచి అంతిమయాత్ర సాగింది. తమ నేతకు తుది వీడ్కోలు పలికేందుకు భారీగా అభిమానులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు కదలివచ్చారు. నోముల మృతి పట్ల సీఎం కేసీఆర్ సహా పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు సంతాపం తెలుపుతూ నివాళులర్పించారు. 

Updated Date - 2020-12-03T18:47:38+05:30 IST