Abn logo
Aug 11 2020 @ 04:50AM

ఎడతెరిపి లేని వర్షం

మందమర్రిటౌన్‌, ఆగస్టు 10: జిల్లా వ్యాప్తంగా సోమవారం ఉదయం నుంచి ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తుండడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. రోడ్లన్నీ బురదమయమయ్యా యి. దీంతో చిరు వ్యాపారులు, కూరగాయలు విక్రయించే వారు ఇబ్బందులు పడ్డారు.


మార్కెట్‌ సెంటర్‌తోపాటు రెండవ జోన్‌, ఎంవీటీసీ సమీపంలో రోడ్లపైనే నీరు నిలిచిపోయింది. పంచముఖి ఆంజనేయస్వామి సమీపంలోని కూరగాయల మార్కెట్‌  బురదమయం కావడంతో విక్రయదారులు కేకే 5 గనికి వెళ్లే రోడ్డుపైనే పెట్టి కూరగాయలు విక్రయించారు. 


జన్నారం : జన్నారం మండలంలో రెండు నెలలుగా ఏక ధాటిగా ముసురు కురుస్తోంది. దీంతో రోడ్లు బురదమయంగా మారాయి. నాళాలన్నీ పొంగి ప్రవహించాయి. 


మంచిర్యాల: జిల్లాలో ఆదివారం మధ్యాహ్నం నుంచి సోమవారం సాయంత్రం వరకు 10.4 మి.మీల వర్షం న మోదైంది. జన్నారంలో 21.8 మి.మీలు, చెన్నూర్‌లో 18.7 మి.మీల వర్షపాతం నమోదైంది. జైపూర్‌ లో 15.3, దండేపల్లిలో 15.0, తాండూర్‌లో 13.9, బెల్లం పల్లిలో 12.8, కాసిపేటలో 11.3 మి.మీల వర్షం నమోదు అయ్యింది. 

Advertisement
Advertisement