పార్టీలకతీతంగా అభివృద్ధికి కృషి : ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

ABN , First Publish Date - 2022-01-19T05:55:02+05:30 IST

మండల అభివృద్ధికి పార్టీలకతీతంగా కృషిచేస్తానని నల్లగొండ ఎంపీ నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అ న్నారు. మండల పరిషత్‌ కార్యాలయంలో మంగళవారం జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో మాట్లాడారు. కరోనా నేపఽథ్యంలో పేద విద్యార్థులకు ఆన్‌లైన్‌ పాఠాల కోసం స్మార్ట్‌ఫోన్‌, ఇంటర్నెట్‌ను ప్రభుత్వమే ఇవ్వాలన్నారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజనం కూడా సమకూర్చాలన్నారు. నాగార్జునసాగర్‌ నియోజకవర్గంలో రోడ్లకు సం బంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు కేం

పార్టీలకతీతంగా అభివృద్ధికి కృషి : ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

గుర్రంపోడు, జనవరి 18: మండల అభివృద్ధికి పార్టీలకతీతంగా కృషిచేస్తానని నల్లగొండ ఎంపీ నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అ న్నారు. మండల పరిషత్‌ కార్యాలయంలో మంగళవారం జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో మాట్లాడారు. కరోనా నేపఽథ్యంలో  పేద విద్యార్థులకు ఆన్‌లైన్‌ పాఠాల కోసం స్మార్ట్‌ఫోన్‌, ఇంటర్నెట్‌ను  ప్రభుత్వమే ఇవ్వాలన్నారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజనం కూడా సమకూర్చాలన్నారు. నాగార్జునసాగర్‌ నియోజకవర్గంలో రోడ్లకు సం బంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు కేంద్రానికి పంపిస్తే సాధ్య మైన త్వరలో మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే నోముల భగత్‌, ఎమ్మెల్సీ ఎంసీ. కోటిరెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీ ఆర్‌ నాయకత్వంలో గ్రామాల్లో అభివృద్ధి జరుగుతుందన్నారు. మం డలంలో నెలకొన్న సమస్యలు తమ దృష్టికి తేవాలని కోరారు. కార్య క్రమంలో ఎంపీపీ మంచికంటి వెంకటేశ్వర్లు, ఎంపీడీవో సుధాకర్‌ పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి మండలకేంద్రంలో విలేకరులతో సీఎం కేసీఆర్‌ రైతుల పక్షపాతి అని అన్నారు. సబ్బండ వర్గాల కోసం అనేక పథకాలు ప్రవేశపెట్లారన్నారు. ఆయన వెంట గాలి రవికుమార్‌, కంచర్ల విజయేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-19T05:55:02+05:30 IST