ప్రధాన తపాల శాఖలో పనిచేయని జనరేటర్‌

ABN , First Publish Date - 2021-08-03T06:41:14+05:30 IST

ఖాతాదారులతో కిటకిట లాడే నగరంలోని ప్రధాన తపాలా కార్యాల యంలో సోమవారం కొద్ది సేపు విద్యుత సరఫరాకు అంతరాయం ఏర్పడడంతో అంధ కారంతో నిండిపోయింది.

ప్రధాన తపాల శాఖలో పనిచేయని జనరేటర్‌
కరెంటు పోవడంతో అంధకారంలో ఉన్న తపాల కార్యాలయం


- ఉద్యోగులకు తప్పని అవస్థలు

అనంతపురం ప్రెస్‌క్లబ్‌, ఆగస్టు2 : ఖాతాదారులతో కిటకిట లాడే నగరంలోని ప్రధాన తపాలా కార్యాల యంలో సోమవారం కొద్ది సేపు విద్యుత సరఫరాకు అంతరాయం ఏర్పడడంతో  అంధ కారంతో నిండిపోయింది. ఆ కాసేపు ఉద్యోగులు సతమతమ య్యా రు. రోజుకు రూ. కోట్లల్లో టర్నోవర్‌ జరిగే  కార్యాలయంలో ఉన్న జనరేటర్‌ ఆరు నెలలుగా పనిచేయడం లేదని తెలిసి ఖాతాదారు లు విస్మయం వ్యక్తం చేశారు.  ఖాతాదారుల డిపాజిట్‌, విత డ్రాల కు సంబంధించి కంప్యూటర్లలో డేటా సేవ్‌ చేసే సమయంలో అనేకసార్లు కరెంటు పోతుండటంతో ఇబ్బందులు పడుతున్నట్లు ప లువురు ఉద్యోగులు పేర్కొన్నారు. ఇలా అనేకసార్లు గంటల తర బడి కరెంటు పోయిన పరిస్థితులు ఉన్నాయన్నారు. ఈ విషయం పై ఆ శాఖాధికారులను అడ గగా... జనరేటర్‌ విషయమై ఆర్వో అధికారులకు నివేదిక పంపి నట్లు తెలిపారు. అక్కడి నుంచి అనుమతి వస్తే దానికి మరమ్మతులు  చేపడుతామన్నారు. 



Updated Date - 2021-08-03T06:41:14+05:30 IST