నూడుల్స్‌తో బొమ్మరిల్లు!

ABN , First Publish Date - 2020-02-19T06:11:57+05:30 IST

ఇన్‌స్టంట్‌ నూడుల్స్‌ ప్యాకెట్‌ కనిపిస్తే ఏం చేస్తారు? వేడివేడిగా బ్రేక్‌ఫాస్ట్‌గానో, సాయంత్రం స్నాక్స్‌గానో తినేస్తారు. కానీ చైనాకు చెందిన ఝాంగ్‌ అనే వ్యక్తి నూడుల్స్‌తో ఒక ప్లే హౌజ్‌...

నూడుల్స్‌తో బొమ్మరిల్లు!

ఇన్‌స్టంట్‌ నూడుల్స్‌ ప్యాకెట్‌ కనిపిస్తే ఏం చేస్తారు? వేడివేడిగా బ్రేక్‌ఫాస్ట్‌గానో, సాయంత్రం స్నాక్స్‌గానో తినేస్తారు. కానీ చైనాకు చెందిన ఝాంగ్‌ అనే వ్యక్తి నూడుల్స్‌తో ఒక ప్లే హౌజ్‌ నిర్మించాడు. తనకు పుట్టబోయే పిల్లల కోసం ఆ బొమ్మరిల్లు కట్టాడు. నాలుగు రోజుల పాటు శ్రమించి 2వేల నూడుల్స్‌ ప్యాకెట్స్‌ను ఉపయోగించి ఆ నిర్మాణం పూర్తి చేశాడు.


నూడుల్స్‌ ప్యాకెట్లను జిగురుతో అతికిస్తూ రూపొందించిన ఆ ప్లే హౌజ్‌ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. నూడుల్స్‌ను హాయిగా తినకుండా అలా వృథా చేశాడెందుకు అనుకుంటే పొరబడినట్టే. ఎందుకంటే ఆయన ఉపయోగించిన నూడుల్స్‌ ప్యాకెట్లన్నీ ఎక్స్‌పయిరీ తేదీ దాటినవే. వాటిని పడేయడం ఎందుకని అలా ప్లే హౌజ్‌ నిర్మించాడు. 

Updated Date - 2020-02-19T06:11:57+05:30 IST