నూడుల్స్‌ సూప్‌

ABN , First Publish Date - 2022-01-01T18:30:35+05:30 IST

ఈశాన్య రాష్ట్రాలైన సిక్కిం, మేఘాలయ, అసోంలలో పాపులర్‌ సూప్‌ ఇది. రకరకాల వెజిటబుల్స్‌, నూడుల్స్‌తో చేసే ఈ సూప్‌ శరీరంలో వేడిని పుట్టిస్తుంది.

నూడుల్స్‌ సూప్‌

ఈశాన్య రాష్ట్రాలైన సిక్కిం, మేఘాలయ, అసోంలలో పాపులర్‌ సూప్‌ ఇది. రకరకాల వెజిటబుల్స్‌, నూడుల్స్‌తో చేసే ఈ సూప్‌ శరీరంలో వేడిని పుట్టిస్తుంది. 


కావలసినవి: నూడుల్స్‌ - 150గ్రాములు, తరిగిన ఉల్లిపాయలు - పావు కప్పు, బీన్స్‌ - ఐదారు, క్యారెట్‌ - ఒకటి, క్యాబేజీ తురుము - పావు కప్పు, స్ర్పింగ్‌ ఆనియన్స్‌ - రెండు(గార్నిష్‌ కోసం), కొత్తిమీర - ఒక కట్ట, స్వీట్‌ చిల్లీ సాస్‌ - మూడు టేబుల్‌స్పూన్లు, వెల్లుల్లి రెబ్బలు - రెండు, సోయాసాస్‌ - రెండు టీస్పూన్లు, నూనె - రెండు టీస్పూన్లు, జీలకర్ర పొడి - అర టీస్పూన్‌, గరం మసాలా - పావు టీస్పూన్‌, ఉప్పు - రుచికి తగినంత. కూరగాయల రసం - నాలుగు కప్పులు.


తయారీ విధానం: ముందుగా నూడుల్స్‌ని ఉడికించి పక్కన పెట్టుకోవాలి. బీన్స్‌, క్యారెట్‌, కొత్తిమీరను తరిగి పక్కన పెట్టుకోవాలి. స్టవ్‌పై వెడల్పాటి పాన్‌ పెట్టి నూనె వేసి వేడి అయ్యాక తరిగిన ఉల్లిపాయలు, దంచిన వెల్లుల్లి వేసి వేయించాలి. ఉల్లిపాయలు  వేగిన తరువాత కట్‌ చేసి పెట్టుకున్న బీన్స్‌, క్యారెట్‌, క్యాబేజీ తురుము వేసి తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి. కాసేపు ఉడికిన తరువాత గరంమసాల, స్వీట్‌ చిల్లీ సాస్‌, సోయా సాస్‌ వేసి కలియబెట్టుకోవాలి. ఇప్పుడు కూరగాయల రసం పోయాలి. చిన్నమంటపై ఐదు నిమిషాలు మరిగించాలి. అవసరమైతే కొన్ని నీళ్లు కలుపుకోవచ్చు. తరువాత తరిగిన కొత్తిమీర వేసి మరో ఐదు నిమిషాలు మరిగించాలి. చివరగా నూడుల్స్‌ వేసి, జీలకర్ర పొడి వేసి కలియబెట్టుకోవాలి. చిన్నమంటపై రెండు, మూడు నిమిషాలు ఉంచి దింపుకోవాలి. స్ర్పింగ్‌ ఆనియన్స్‌తో గార్నిష్‌ చేసుకుని సర్వ్‌ చేసుకోవాలి.


Updated Date - 2022-01-01T18:30:35+05:30 IST