ఐఆర్‌సీటీసీ ఆధ్వర్యంలో ఉత్తర భారతయాత్ర

ABN , First Publish Date - 2021-06-19T06:34:36+05:30 IST

రేణిగుంట నుంచి ఐఆర్‌సీటీసీ ఆధ్వర్యంలో ఉత్తరభారత యాత్ర ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు తిరుపతి ఏరియా అధికారి ప్రసాద్‌ తెలిపారు.

ఐఆర్‌సీటీసీ ఆధ్వర్యంలో ఉత్తర భారతయాత్ర

తిరుపతి(ఆటోనగర్‌), జూన్‌ 18: రేణిగుంట నుంచి ఐఆర్‌సీటీసీ ఆధ్వర్యంలో ఉత్తరభారత యాత్ర ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు తిరుపతి ఏరియా అధికారి ప్రసాద్‌ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం రైల్వేస్టేషన్‌లోని తమ కార్యాలయంలో యాత్ర ప్రచార కరపత్రాలను విడుదల చేశారు. ఈ యాత్రలో పగలు 11రోజులు, 10రాత్రులు ఉంటాయని, ఈ ప్రత్యేక రైలు రేణిగుంటలో ఆగస్టు 27న ఉదయం బయల్దేరి, నెల్లూరు, ఒంగోలు, విజయవాడ, గుంటూరు, నల్గొండ, సికింద్రాబాదు, ఖాజీపేట, పెద్దపల్లి, రామగుండం, నాగపూర్‌ రైల్వేస్టేషన్లలో పర్యాటకులను ఎక్కించుకుని ఆగ్రా చేరుకుంటుంది. 


దర్శించుకునే ప్రాంతాలు

ఆగ్రా, మధుర, వైష్ణదేవి ఆలయం, అమృత్‌సర్‌, హరిద్వార్‌తోపాటు ఢిల్లీలో పర్యటించే ఈ రైలు సెప్టెంబరు ఆరున ఉదయం రేణిగుంటకు చేరుకుంది.


టికెట్‌ ధరలు 

స్లీపర్‌ రూ.10,400, త్రీఏసీ రూ.17,330లుగా నిర్ణయించారు. పర్యాటకులు 82879 32313, 82879 32317 నెంబర్లను లేదా రైల్వే వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు.

Updated Date - 2021-06-19T06:34:36+05:30 IST