ఉత్తర Karnatakaను వరించిన మూడో వైమానిక శిక్షణా కేంద్రం

ABN , First Publish Date - 2022-01-15T14:36:07+05:30 IST

ఉత్తరకర్ణాటక ప్రాంతానికి మరో వైమానిక శిక్షణా కేంద్రం వరించింది. హుబ్బళ్ళిలోని విమానాశ్రయానికి అనుబంధం గా వైమానిక శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ) అనుమతిచ్చింది. ఇప్పటికే బెళగావితో

ఉత్తర Karnatakaను వరించిన మూడో వైమానిక శిక్షణా కేంద్రం


బెంగళూరు: ఉత్తర కర్ణాటక ప్రాంతానికి మరో వైమానిక శిక్షణా కేంద్రం వరించింది. హుబ్బళ్ళిలోని విమానాశ్రయానికి అనుబంధం గా వైమానిక శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ) అనుమతిచ్చింది. ఇప్పటికే బెళగావితో పాటు కలబురిగిలో శిక్షణా కేంద్రాలు ఉండగా తాజాగా మరో కేంద్రం వచ్చింది. రాష్ట్రంలో సుదీర్ఘ కాలంగా ఉన్న విమానాశ్రయాలలో హుబ్బళ్ళి కూడా ఒకటి. రన్‌వే విస్తరణతో పాటు కొత్త టర్మినల్‌ నిర్మాణాలు చేపట్టి విమానాశ్రయాన్ని ‘ఉడాన్‌’ పథకానికి అనుబంధం చేశారు. ప్రస్తుతం వైమానిక శిక్షణా కేంద్రాన్ని హుబ్బళ్ళిలో ఏర్పాటు చేయడం ద్వారా పైలెట్‌ శిక్షణ పొందదలచిన ఉత్తరకర్ణాటక వాసులు ముంబై, హైదరాబాద్‌, బెంగళూరు నగరాలకు వెళ్ళే అవసరం తప్పనుంది. గత ఏడాది రాష్ట్రంలో ఐదు శిక్ష ణా కేంద్రాలను ఏర్పాటు చేయాల నే తీర్మానించారు. అనుమతుల కోసం ఎయిర్‌ పోర్టు అథారిటీకు నివేదికలు పంపారు. తొలుత బెంగళూరులోని జక్కూరులో మాత్రమే వైమానిక శిక్షణా కేంద్రం ఉండేది. ఇప్పటికే కలబురిగితో పాటు బెళగావిలోను కేంద్రాలు పనిచేస్తుండగా తాజాగా మరో కేంద్రం మరింత మంది యువతకు అనుకూలం కానుంది. ఇదే విషయమై శుక్రవారం హుబ్బళ్ళి ఎయిర్‌పోర్టు డైరెక్టర్‌ ప్రమోద్‌ ఠాక్రే మీడియాతో మాట్లాడుతూ వైమానిక శిక్షణా కేంద్రాన్ని ఆరంభించేందుకు మౌలిక సదుపాయాలు విమానాశ్రయంలోనే ఉన్నాయన్నారు. టెండర్‌లను ఆహ్వానించాల్సి ఉందన్నారు. కనీసం 10-15 ఏళ్ళ పాటు కేంద్రాన్ని కొనసాగించి తర్వాత కేంద్ర ఎయిర్‌పోర్టు అథారిటీకి అప్పగించాలన్నారు. హుబ్బళ్ళి వాణిజ్య కేంద్రం కావడంతో శిక్షణలకు అనుకూలం కానుందన్నారు.

Updated Date - 2022-01-15T14:36:07+05:30 IST