ఒలింపిక్స్‌కు ఉ.కొరియా దూరం

ABN , First Publish Date - 2021-04-07T09:49:15+05:30 IST

ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్‌లో ఈసారి తాము పాల్గొనడం లేదని ఉత్తర కొరియా ప్రకటించింది. తమ ఆటగాళ్లను కరోనా నుంచి రక్షించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆ దేశ క్రీడా మంత్రిత్వ శాఖ ప్రకటించింది...

ఒలింపిక్స్‌కు ఉ.కొరియా దూరం

  • కరోనా నుంచి రక్షణ కోసమే..


సియోల్‌: ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్‌లో ఈసారి తాము పాల్గొనడం లేదని ఉత్తర కొరియా ప్రకటించింది. తమ ఆటగాళ్లను కరోనా నుంచి రక్షించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆ దేశ క్రీడా మంత్రిత్వ శాఖ ప్రకటించింది. దీంతో దక్షిణ కొరియా అవకాశాలకు దెబ్బ పడినట్టయింది. ఈ రెండు దేశాలు కలిసి టోక్యో గేమ్స్‌లో ఒకే జట్టుగా బరిలోకి దిగాలనుకున్నాయి. ఈ ఏడాది జూలై 23 నుంచి ఆగస్టు 8 వరకు ఈ విశ్వ క్రీడలు జరుగుతాయి. 1988 సియోల్‌ గేమ్స్‌ తర్వాత కొరియా ఈ మెగా ఈవెంట్‌కు దూరం కావడం ఇదే తొలిసారి. 



మన మీరాకు పతకావకాశం 


టోక్యో ఒలింపిక్స్‌కు ఉత్తర కొరియా దూరం కావడంతో భారత వెయిట్‌ లిఫ్టర్‌ మీరాబాయి చాను, రెజ్లర్‌ వినేశ్‌ ఫొగట్‌ పతకావకాశాలు మెరుగయ్యాయి. మహిళల 49 కేజీ విభాగంలో ప్రస్తుతం నాలుగో ర్యాంకులో ఉన్న చానుకు ఉ.కొరియా లిఫ్టర్‌రి సోంగ్‌ గుమ్‌ ప్రధాన పోటీదారు. 2019 ప్రపంచ చాంపియన్‌షి్‌ప్సలోనూ గుమ్‌ తర్వాత చాను నాలుగో స్థానంలో నిలిచింది. కొరియా తప్పుకోవడం తమ జట్టుకు మంచిదేనని, ఇక భారత్‌ పోటీ చైనాతోనే ఉంటుందని జాతీయ కోచ్‌ విజయ్‌ శర్మ తెలిపాడు. అలాగే మహిళల 53 కేజీ విభాగంలో కొరియా రెజ్లర్‌ పాక్‌ యాంగ్‌ మి వైదొలగడంతో వినేశ్‌ మెడల్‌ చాన్స్‌ కూడా మెరుగయ్యాయి.


Updated Date - 2021-04-07T09:49:15+05:30 IST