ముంబైకి నార్త్‌ఈస్ట్‌ షాక్‌

ABN , First Publish Date - 2020-11-22T09:16:34+05:30 IST

ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ (ఐఎ్‌సఎల్‌)లో నార్త్‌ఈస్ట్‌ యునైటెడ్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌ ఘనమైన బోణీ చేసింది. శనివారం జరిగిన మ్యాచ్‌లో నార్త్‌ఈస్ట్‌ జట్టు..

ముంబైకి నార్త్‌ఈస్ట్‌ షాక్‌

గోవా: ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ (ఐఎ్‌సఎల్‌)లో నార్త్‌ఈస్ట్‌ యునైటెడ్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌ ఘనమైన బోణీ చేసింది. శనివారం జరిగిన మ్యాచ్‌లో నార్త్‌ఈస్ట్‌ జట్టు.. ఏకైక గోల్‌తో స్టార్‌ ఆటగాళ్లతో కూడిన ముంబై సిటీ ఫుట్‌బాల్‌ క్లబ్‌కు షాకిచ్చింది. 49వ నిమిషంలో స్ట్రయికర్‌ క్వేసి అపియా పెనాల్టీని గోల్‌గా మలిచాడు. మ్యాచ్‌ ఆరంభం నుంచే ముంబై దూకుడు ప్రదర్శించింది. బంతిని అధికభాగం తన అధీనంలో ఉంచుకుంది. కానీ అందివచ్చిన అవకాశాలను గోల్స్‌గా మలచలేకపోయింది. మరోవైపు నార్త్‌ఈస్ట్‌ రక్షణశ్రేణి ప్రత్యర్థి దాడులను సమర్థంగా తిప్పికొట్టింది. ప్రథమార్థం రెండు నిమిషాల్లో ముగుస్తుందనగా.. ముంబై సిటీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.  ప్రత్యర్థి ఆటగాడు ఖాసా కమరాను మొరటుగా అడ్డుకోవడంతో ముంబై  కీలక మిడ్‌ఫీల్డర్‌ అహ్మద్‌ జాహు రెడ్‌కార్డ్‌తో మైదానం వీడాల్సి వచ్చింది. దాంతో ముంబై జట్టు పదిమందికే పరిమితమైంది. రెండో అర్ధ భాగంలో నార్త్‌ఈస్ట్‌ విజృంభించింది. ఈ క్రమంలో 49వ నిమిషంలో లభించిన పెనాల్టీని అపియా పొరపాటు లేకుండా గోల్‌పో్‌స్టలోకి పంపి నార్త్‌ఈ్‌స్టను ఆధిక్యంలో నిలిపాడు. ఇక జాహు లేకపోవడంతో ముంబై మిడ్‌ఫీల్డ్‌ చేష్టలుడిగింది. ఇదే అదనుగా నార్త్‌ఈస్ట్‌ దాడులకు పదును పెంచింది. ఆపై ప్రత్యర్థికి ఎటువంటి అవకాశం ఇవ్వకుండా మ్యాచ్‌ను ముగించింది. 

Updated Date - 2020-11-22T09:16:34+05:30 IST