Viral Video: వయసు పెరిగినా ప్రేమ మాత్రం అస్సలు తగ్గలేదు.. భార్య కోసం 72ఏళ్ల వృద్ధుడు ఏం చేశాడో తెలిస్తే నోరెళ్లబెడతారు

ABN , First Publish Date - 2021-10-12T19:31:16+05:30 IST

భార్య మీద ప్రేమతో 72ఏళ్ల వృద్ధుడు అద్భతం చేశాడు. అరుదైన బహుమతితో భార్యను ఆశ్చర్యపరచడమే కాకుండా.. వయసు పెరిగిందే తప్ప ఆమెపై తనకు ఉన్న ప్రేమ రవ్వంత కూడా తగ్గలేదని నిరూపించాడు. ప్రస్తుతం ఆ వృద్ధుడు తన భార్యకు ఇచ్చిన బహుమతికి

Viral Video: వయసు పెరిగినా ప్రేమ మాత్రం అస్సలు తగ్గలేదు.. భార్య కోసం 72ఏళ్ల వృద్ధుడు ఏం చేశాడో తెలిస్తే నోరెళ్లబెడతారు

ఇంటర్నెట్ డెస్క్: భార్య మీద ప్రేమతో 72ఏళ్ల వృద్ధుడు అద్భతం చేశాడు. అరుదైన బహుమతితో భార్యను ఆశ్చర్యపరచడమే కాకుండా.. వయసు పెరిగిందే తప్ప ఆమెపై తనకు ఉన్న ప్రేమ రవ్వంత కూడా తగ్గలేదని నిరూపించాడు. ప్రస్తుతం ఆ వృద్ధుడు తన భార్యకు ఇచ్చిన బహుమతికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతుండగా.. వాటిని చూసిన నెటిజన్లు భార్యపై ఆ వృద్ధుడికి ఉన్న ప్రేమకు ఫిదా అవుతున్నారు. పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ఇంతకూ ఆ తాత.. తన భార్యకు ఏం గిఫ్ట్ ఇచ్చాడనే వివరాల్లోకి వెళితే. 



బోస్నియాకు చెందిన వోజిన్ కుసిక్‌కు ఇప్పుడు 72ఏళ్ల వయసు. చిన్నప్పుడు స్కూల్ విద్యను పూర్తి చేసిన ఆయన.. ఫ్యామిలీకి సంబంధించిన వ్యాపారాల వల్ల కాలేజీకి వెళ్లలేకపోయాడు. తాజాగా తరతరాలుగా వస్తున్న ఆ ఫ్యామిలీ బిజినెస్‌కు సంబంధించిన వ్యవహారాలన్నింటినీ తన కుమారులకు అప్పగించిన అతడు తన భార్యకు ఓ మంచి ఇంటిని నిర్మించి ఇవ్వాలనుకున్నాడు. ఈ క్రమంలో అద్భుతమైన ఫీచర్లతో ఓ ఇంటిని కట్టాడు. ఈ ఇంటికి గురించి ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే.. ఆ ఇల్లు 360 డిగ్రీల కోణంలో తిరుతూ ఉంటుంది. 



లేత ఆకుపచ్చ రంగు గోడలు, ఎరుపు వర్ణం రూఫ్ కలిగిన.. ఈ తిరిగే ఇంటిని కొందరు వీడియో తీసి సోషల్ మీడియాతో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం అదికాస్తా వైరల్‌గా మారింది. దీంతో భార్యపై ఆ వృద్ధుడికి ఉన్న ప్రేమను చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఇదిలా.. దీనిపై వోజిన్ కౌసీ స్పందిస్తూ.. ఇల్లు కట్టాలనుకున్నప్పుడు తమ పాత ఇంటికి గురించి గతంలో తన భార్య అన్న మాటలు గుర్తొచ్చినట్టు చెప్పాడు. సూర్యకాంతి పడేలా తమ బెడ్‌రూం లేకపోవడం పట్ల అసంతృప్తి చెందిందన్నారు. ఈ క్రమంలోనే రోటేటింగ్‌ హౌస్‌కు సంబంధించిన ఆలోచన వచ్చినట్టు చెప్పారు. అంతేకాకుండా ఇల్లు గుండ్రంగా తిరేగేందుకు ఎలక్ట్రికల్ పరికరాలను ఉపయోగించినట్లు వివరించారు. 






Updated Date - 2021-10-12T19:31:16+05:30 IST