రైతుల ఆందోళనలతో పలు రైళ్ల రాకపోకల రద్దు

ABN , First Publish Date - 2020-09-25T13:46:57+05:30 IST

కేంద్రం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా రైతులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో పలు రైళ్ల రాకపోకలను రద్దు చేస్తున్నట్లు....

రైతుల ఆందోళనలతో పలు రైళ్ల రాకపోకల రద్దు

న్యూఢిల్లీ : కేంద్రం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా రైతులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో పలు రైళ్ల రాకపోకలను రద్దు చేస్తున్నట్లు రైల్వేశాఖ ప్రజాసంబంధాలశాఖ ముఖ్యఅధికారి దీపక్ కుమార్ తెలిపారు. నంబరు 04652 అమృత్ సర్-జయానగర్ ఎక్స్ ప్రెస్ ఈ నెల 25వతేదీన రద్దు చేశారు. జయానగర్-అమృత్ సర్ ఎక్స్ ప్రెస్ ను కూడా ఈ నెల27వతేదీన రద్దు చేశారు.02058, 02057 నంబర్ల న్యూఢిల్లీ-ఉనా హిమాచల్ స్పెషల్ రైలు జర్నీని తక్కువ దూరం నడుపుతున్నారు. ఈ నెల 24,25, 26, 27 తేదీల్లో తిరగాల్సిన అమృత్ సర్- ముంబై సెంట్రల్ స్పెషల్ రైలును అంబాలా వరకు నడుపుతున్నారు. ఫిరోజ్ పూర్ రైల్వే డివిజనులో 14 స్పెషల్ ప్యాసింజరు రైళ్లను రద్దు చేశారు.

Updated Date - 2020-09-25T13:46:57+05:30 IST