సాగర్‌పైనే ఆశలు

ABN , First Publish Date - 2020-07-01T11:29:55+05:30 IST

ఈ వానాకాలంలో ఉత్తర తెలంగాణ జిల్లాల రైతులు శ్రీరామ సాగర్‌పైనే ఆశలు పెట్టుకున్నారు

సాగర్‌పైనే ఆశలు

ఎస్సారెస్పీ పైనే ఉత్తర తెలంగాణ రైతుల ఆశలు

నారుమడులు సిద్ధం చేసుకుంటున్న అన్నదాతలు

ఆయకట్టుకు నీటివిడుదలపై నేడు జరిగే శివం కమిటీలో నిర్ణయం

నేడు తెరుచుకోనున్న బాబ్లీ ప్రాజెక్టు గేట్లు


నిజామాబాద్‌, జూన్‌ 30 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి):

ఈ వానాకాలంలో ఉత్తర తెలంగాణ జిల్లాల రైతులు శ్రీరామ సాగర్‌పైనే ఆశలు పెట్టుకున్నారు. జిల్లా రైతు లు ఆ నీటిపైనే నమ్మకం ఉంచి పంటలను వేస్తున్నారు. ప్రాజెక్టుతో పాటు ఎత్తిపోతల పథకాల ద్వారా వానాకా లం సాగుకు నీరందుతుందని భావిస్తున్నారు. ఆయక ట్టు పరిధిలో నారుమడులను సిద్ధం చేస్తున్నారు. వర్షాలతో పాటు ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకం ద్వారా రెం డు పంటలకు నీళ్లందుతాయని భావిస్తున్నారు. భూగర్భజలాలు ఉన్న చోట ముందస్తుగానే నాట్లు వేసేందు కు సిద్ధమవుతున్నారు. వర్షాకాలం మొదలై నెల రోజు లు గడవడంతో రైతులు సాగు పనులను మొదలుపెట్టారు. ఆయకట్టు పరిధిలో నారుమడులను సిద్ధం చేస్తున్నారు. ప్రభుత్వం ఈ దఫా ఎస్సారెస్పీ పరిధిలోని మొత్తం ఆయకట్టుకు నీళ్లందించే అవకాశం ఉండడంతో ఎక్కువ మంది రైతులు వరి సాగు వైపు మొగ్గుచూపుతున్నారు. నారుమడులను సిద్ధం చేయడంతో పాటు భూగర్భజలాలు ఉన్నచోట నాట్లు వేసేందు కు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఎస్సారెస్పీలో గతంలో ఎన్న డూ లేని విధంగా ఈ సంవత్సరం 29.722 టీఎంసీల నీళ్లు నిల్వ ఉన్నాయి. ఈ ప్రాజెక్టు పరిధిలోని ఎల్‌ఎండీలో 7 టీఎంసీల వరకు నీళ్లు ఉన్నాయి.


ప్రస్తుతం వర్షాకాలం మొదలైనందున ఈ రెండు ప్రాజెక్టులకు వరద వచ్చే అవకాశం ఉండ డంతో ముందస్తుగా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం రెండింటిలో కలిపి తాగునీటి అవసరాల కు పోను 30 టీఎంసీల వరకు నీళ్లు అందుబాటులో ఉన్నాయి. మహారాష్ట్రలో వర్షాలు మొదలై తే గోదావరికి భారీగా వరద కూడా వచ్చే అవకాశం ఉండం తో వానాకాలంలో ఆయకట్టుకు సాగునీరందించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఎస్సారె స్పీ పరిధిలో స్టేజ్‌-1 కింద కాకతీయ, లక్ష్మి, సరస్వతి కాలువల కింద 9.20 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఎస్సారెస్పీపై ఆధారపడిన ఎత్తిపోతల పథకాలు గుత్ప, అలీసాగర్‌తో పాటు ఇతర పథకాల కింద మరో రెండు లక్షల ఎకరా ల వరకు ఆయకట్టు ఉంది. గత సంవత్సరం జూన్‌ నెలలోనే ఎస్సారెస్పీకి వరద మొదలైంది. ఈ సంవత్సరం నెల రోజులు గడిచినా ఇప్పటి వరకు భారీ వర్షాలు పడలేదు. ప్రాజెక్టులోకి వరద రాలేదు.


ఎస్సారెస్పీ పున రుజ్జీవ పథకం ఉండడంతో అవసరమైతే కాళేశ్వరం నుంచి నీటిని తరలించి సాగుకు అందించేందుకు అధి కారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయానికి అ నుగుణంగా ఎస్సారెస్పీ పరిధిలోని నిజామాబాద్‌, నిర్మ ల్‌, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్‌, వరంగల్‌ అర్బన్‌, వరంగల్‌ రూరల్‌ జిల్లాల పరిధిలో ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు సిద్ధమవుతున్నారు. వరద ఎక్కు వగా వస్తే అవసరమైతే స్టేజ్‌-2 కింద మహబూబాబా ద్‌,  సూర్యపేట జిల్లాల వరకు నీటిని తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉత్తర తెలంగాణ పరిధిలో రెం డు పంటలకు ఈ దఫా సాగునీరు అందే విధంగా ఏ ర్పాట్లు చేస్తున్నారు. ప్రాణహిత, పెన్‌గంగా వరదల వ ల్ల కాళేశ్వరం వద్ద గోదావరి ప్రవాహం మొదలు అయి తే ఎక్కువ నీటిని తరలించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో ఈ దఫా వానాకాలంలో ఎక్కువ మొ త్తంలో ఆయకట్టుకు సాగునీరు అందించాలని నిర్ణయించారు. మంత్రి ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ఇప్పటికే అధికారులతో సమావేశాలు నిర్వహించారు. 20, 21 ప్యాకేజీల కింద కూడా ఆయకట్టుకు నీళ్లందే వి ధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు. 


నేడు బాబ్లీ ప్రాజెక్టు గేట్లు ఎత్తనున్న అధికారులు

ఎస్సారెస్పీ ఎగువన మహారాష్ట్రలో నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు గేట్లను బుధవారం ఎత్తనున్నారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం ప్రతీ జూలై ఒకటిన గేట్లు ఎత్తి.. అక్టోబరు నెలాఖరులో మూసివేస్తారు. మహారాష్ట్రలో కురిసే వర్షాలతోనే ఎస్సారెస్పీ నిండుతుండడంతో గోదావరి వరదను ఆపకు ండా ఉండేందుకు సుప్రీంకోర్డు ఈ ఉత్తర్వులు ఇచ్చింది. ఆ ఉత్తర్వులకు అను గుణంగా ప్రతియేటా ఎస్సారెస్పీ ఈఈ, నాందేడ్‌ ఈఈ, ఏపీ సాగునీటి శాఖ రాజమండ్రికి చెందిన ఈఈతో పాటు కేంద్ర జలవనరుల సంఘం ఈఈల సమ క్షంలో గేట్లు ఎత్తుతారు. గోదావరి నుంచి జూలై ఒకటి నుంచి అక్టోబరు నెలాఖరు వరకు ఎస్సారెస్పీకి వరద వస్తుంది.


నేడు శివం కమిటీ సమావేశం

ఎస్సారెస్పీతో పాటు ఇతర ప్రాజెక్టుల పరిధిలో సాగునీరందించేందుకు నేడు హైదరాబాద్‌లో శివం కమిటీ సమావేశం జరగనుంది. సాగునీటి శాఖ అధికారులతో పాటు ఈఎంసీలు, చీఫ్‌ ఇంజనీర్‌లు, ఎస్సారెస్పీ  సీఈతో పాటు గోదావరి బేసిన్‌ కమిషనర్‌ ఈ సమావేశంలో పాల్గొంటారు. ఏయే ప్రాజెక్టు నుంచి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఆయకట్టుకు సాగునీరందించాలో నిర్ణయం తీసుకుంటారు. దానికనుగుణంతానే వాకాకాలం సాగుకు నీటిని విడుదల చేస్తారు.

Updated Date - 2020-07-01T11:29:55+05:30 IST