కార్‌స్టెన్‌ ప్రపంచ రికార్డు

ABN , First Publish Date - 2021-08-04T09:27:48+05:30 IST

పురుషుల 400 మీటర్ల హర్డిల్స్‌ ఫైనల్స్‌లో నార్వే అథ్లెట్‌ వార్హోమ్‌ కార్‌స్టెన్‌ తన ప్రపంచ రికార్డును తానే బద్దలు కొట్టుకొని ఒలింపిక్స్‌లో చరిత్ర సృష్టించాడు...

కార్‌స్టెన్‌ ప్రపంచ రికార్డు

టోక్యో: పురుషుల 400 మీటర్ల హర్డిల్స్‌ ఫైనల్స్‌లో నార్వే అథ్లెట్‌ వార్హోమ్‌ కార్‌స్టెన్‌ తన ప్రపంచ రికార్డును తానే బద్దలు కొట్టుకొని ఒలింపిక్స్‌లో చరిత్ర సృష్టించాడు. మంగళవారం ముగిసిన ఈ పోటీల్లో కార్‌స్టెన్‌ 45.94 సెకన్లలో రేసును పూర్తి చేసి తన పాత రికార్డు (46.70)ను అధిగమించాడు. బెంజిమిన్‌ రాయ్‌ (అమెరికా) ద్వితీయ, డోస్‌ సాంటోస్‌ అలీసన్‌ (బ్రెజిల్‌) తృతీయ స్థానాల్లో నిలిచారు.


Updated Date - 2021-08-04T09:27:48+05:30 IST