బెదిరింపులకు భయపడేది లేదు : పుత్తా

ABN , First Publish Date - 2021-03-08T05:20:40+05:30 IST

వైసీపీ బెదిరింపులకు భయపడేది లేదని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహారెడ్డి అన్నారు. ఆదివారం కడపలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ పోలీసులను అడ్డుపెట్టుకుని టీడీపీ కార్యకర్తలను బెదిరిస్తున్నారని, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగాలని టీడీపీ కోరుకుంటోందన్నారు.

బెదిరింపులకు భయపడేది లేదు : పుత్తా
విలేకర్లతో మాట్లాడుతున్న పుత్తా నరసింహారెడ్డి

కడప, మార్చి 7 (ఆంధ్రజ్యోతి): వైసీపీ బెదిరింపులకు భయపడేది లేదని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహారెడ్డి అన్నారు. ఆదివారం కడపలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ పోలీసులను అడ్డుపెట్టుకుని టీడీపీ కార్యకర్తలను బెదిరిస్తున్నారని, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగాలని టీడీపీ కోరుకుంటోందన్నారు. చిన్నచౌకు పోలీసుల తీరు వివాదాస్పదంగా ఉందని, వారిపై ఎన్నికల కమిషన్‌ కలెక్టరు, ఎస్పీ దృష్టికి తీసుకెళతామన్నారు. వైసీపీకి ఓటు వేయకుంటే పెన్షన్‌, అమ్మఒడి పథకాలను నిలిపివేస్తామని బెదిరిస్తున్నారని, ఎన్నికలు ఎదుర్కోలేకే అడ్డదార్లు తొక్కుతున్నారన్నారు. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి హరిప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-03-08T05:20:40+05:30 IST