Abn logo
Sep 25 2020 @ 03:22AM

అవసరమున్న స్కూళ్లలో నిర్మించలేదు

ఏపీలో అవసరం లేని చోట్ల మరుగుదొడ్ల నిర్మాణం: కాగ్‌ 


న్యూఢిల్లీ-ఆంధ్రజ్యోతి: అవసరం లేని పాఠశాలల్లో మరుగుదొడ్లు నిర్మించారు. కానీ ఎక్కువ అవసరమున్న చోట మాత్రం తక్కువ ఉన్నాయి. ఇదీ ఏపీలోని పాఠశాలల్లో మరుగుదొడ్లు నిర్మించిన తీరు. స్వచ్ఛ విద్యాలయ అభియాన్‌ కింద నిర్మించిన మరుగుదొడ్లపై అధ్యయనం చేసి కాగ్‌ రూపొందించిన నివేదికను కేంద్రం పార్లమెంటుకు అందజేసింది. నివేదికలో ఏపీ ప్రస్తావన కూడా ఉంది.


2015లో పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ సంస్థ మరుగుదొడ్లు నిర్మించడానికి 8,100 పాఠశాలలను గుర్తించి నిర్మాణ బాధ్యతలను హిందుస్థాన్‌ ప్రీఫ్యాబ్‌ లిమిటెడ్‌కు అప్పగించింది. ఆ పాఠశాలల్లో 2,036 మరుగుదొడ్లు అవసరం లేదని సర్వశిక్ష అభియాన్‌ ప్రాజెక్టు డైరెక్టరు సమాచారం ఇవ్వడంతో పనులు ప్రారంభించిన చోట్ల మాత్రమే పూర్తి చేయాలని హెపీఎల్‌కు సూచించింది.

అప్పటికే నిర్మాణాలు ప్రారంభమైన 675మరుగుదొడ్లను జాబితానుంచి తొలగించవద్దని పీఎ్‌ఫసీ విజ్ఞప్తి చేసింది. అలాగే, అవసరం లేనిచోట కూడా 367 టాయిలెట్లను నిర్మించింది. 


Advertisement
Advertisement
Advertisement