అవి బీడు భూములా?

ABN , First Publish Date - 2020-12-04T05:39:05+05:30 IST

నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో బీడు భూములు ఉన్నాయని ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్‌రెడ్డి ప్రభుత్వానికి తప్పు నివేదికలు ఇచ్చారని ఆర్‌ఏఆర్‌ఎస్‌ కార్మికుల సంఘం గౌరవాధ్యక్షుడు, సీఐటీయూ పట్టణ అధ్యక్షుడు లక్ష్మణ్‌ మండిపడ్డారు.

అవి బీడు భూములా?
కాడెద్దులు, నాగలితో నిరసన వ్యక్తం చేస్తున్న కార్మికులు

  1. ఎంపీ, ఎమ్మెల్యే తప్పు నివేదికలు
  2. ఆర్‌ఏఆర్‌ఎస్‌ కార్మికుల ఆగ్రహం
  3. కాడెద్దులు, నాగలితో నిరసన


నంద్యాల, డిసెంబరు 3: నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో బీడు భూములు ఉన్నాయని ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర    కిషోర్‌రెడ్డి ప్రభుత్వానికి తప్పు నివేదికలు ఇచ్చారని ఆర్‌ఏఆర్‌ఎస్‌ కార్మికుల సంఘం గౌరవాధ్యక్షుడు, సీఐటీయూ పట్టణ అధ్యక్షుడు లక్ష్మణ్‌ మండిపడ్డారు. గురువారం ఆర్‌ఏఆర్‌ఎస్‌ కార్మికులు కాడెద్దులు, నాగలితో నిరసన చేపట్టారు. లక్ష్మణ్‌ మాట్లాడుతూ దేశంలోనే నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానానికి అత్యంత ప్రాధాన్యం ఉందని, ఈ భూములను వైద్య కళాశాలకు కేటాయించడం అన్యాయమని అన్నారు. ఇందుకోసం కేంద్రంలోని సాగు భూములను బీడు భూములని ప్రజా ప్రతినిధులు ప్రభుత్వానికి నివేదికలు ఇవ్వడం ఏమిటని మండిపడ్డారు. రైతుల పక్షాన నిలబడతానని చెప్పుకున్న వైసీపీ ప్రభుత్వం.. రైతుల నడ్డి విరుస్తోందని ధ్వజమెత్తారు. ఏడాదిన్నరగా అధికార యంత్రాంగం వైసీపీ ఎంపీ, ఎమ్మెల్యేల కోసమే పని చేస్తోందని ఆరోపించారు. ఆర్‌ఏఆర్‌ఎస్‌ సాగు భూములను బీడుగా చూపడం వెనుక ఎంపీ పోచా, ఎమ్మెల్యే శిల్పా రవి స్వార్థ ప్రయో జనం ఉందన్నారు. ఈ కుట్రల నుంచి ఆర్‌ఏఆర్‌ఎస్‌ భూమిని కాపాడుకునేందుకు పోరాటాన్ని ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. 

Updated Date - 2020-12-04T05:39:05+05:30 IST