ఐస్‌క్రీమ్‌లు కాదు... పూలు!

ABN , First Publish Date - 2021-09-16T09:15:29+05:30 IST

ఈ చిత్రంలో కనిపిస్తున్నవి నోరూరించే ఐస్‌క్రీమ్‌లు అనుకుంటే మీరు పొరబడినట్టే! ఎందుకంటే అవి ‘ఐస్‌క్రీమ్‌ తులిప్స్‌’ అని పిలిచే ఒకరకమైన పూలు.

ఐస్‌క్రీమ్‌లు కాదు... పూలు!

చిత్రంలో కనిపిస్తున్నవి నోరూరించే ఐస్‌క్రీమ్‌లు అనుకుంటే మీరు పొరబడినట్టే! ఎందుకంటే అవి ‘ఐస్‌క్రీమ్‌ తులిప్స్‌’ అని పిలిచే ఒకరకమైన పూలు. పూల రేకులు విచ్చుకునే ముందు వాటిని చూస్తే క్రీమ్‌ బాగా దట్టించిన ఐస్‌క్రీమ్‌ అనుకోవాల్సిందే. ఈ పూలు ముందుగా లేత గులాబీ రంగులో ఉంటాయి. పువ్వు విచ్చుకోగానే మధ్యలో భాగం తెల్లగా బయటకు వస్తుంది. అప్పుడు పువ్వు పూర్తిగా ఐస్‌క్రీమ్‌ ఆకృతిలో కనిపిస్తుంది. 

Updated Date - 2021-09-16T09:15:29+05:30 IST