Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఇంజనీర్లే కాదు... ప్రాణదాతలు

ఏపీఎంఎస్‌ఐడీసీ ఇంజనీర్ల అవయవదానంపై జేసీ ప్రశంస


అనంతపురం వైద్యం, డిసెంబరు 3: భవంతులు నిర్మించే ఇంజనీర్లే కాదు మనుషుల ప్రాణాలు నిలిపే ప్రాణదాతలని వైద్య శాఖ ఇంజనీర్లను  జేసీ డాక్టర్‌ సిరి ప్రశంసించారు. శుక్రవారం ఏపీఎంఎ్‌సఐడీసీ(ఆంధ్రప్రదేశ మెడికల్‌ సర్వీసెస్‌ అండ్‌ ఇనఫ్రాస్ట్రక్చర్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన) ఈఈ రాజగోపాలరెడ్డితో పాటు ఇతర ఇంజనీర్లు, ఉద్యోగులు శుక్రవారం మరణానంతరం అవయవ దానం చేయడానికి అంగీకారం తెలిపారు. కేఎ్‌సఆర్‌ జూనియర్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన సదస్సులో అందరి సమక్షంలో ఆమోదం తెలిపి పత్రాలు తీసుకుంటున్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జేసీ మాట్లా డుతూ అమ్మ జన్మనిస్తే అవయవదానం పునర్జన్మను ఇస్తుం దన్నా రు. ఇలాంటి అవయవదానంపై దేశంలో పెద్దగా అవగాహన లేదని దీని వల్ల అవయదానం చేయాలనిఉన్నా చేయలేకపోతున్నారన్నారు. ఇప్పటికీ ప్రతి 9 నిమిషాలకు ఒకరు బ్రెయినడెడ్‌తో చనిపోతున్నారని కేవలం 5శాతం మంది మాత్రమే అవయవదానం చేస్తున్నారన్నారు. మన జిల్లాలోనూ ఈ అవయవదానంపై ప్రజల్లో మరింత చై తన్యం తీసుకు రావాలని సూచించారు. అనంతరం అవయవదానానికి అంగీకారం తెలిపిన ఇంజనీర్ల సమ్మతి పత్రాలను ఆమె స్వీకరిం చి అభినందించారు. విద్యార్థినులకు అవయవదానంపై లఘుచిత్రం ద్వారా అవగాహన కల్పించారు. కార్యక్రమంలో వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ నీరజ, ఆస్పత్రి ఇనచార్జ్‌ సూపరింటెం డెంట్‌ మళ్లీశ్వరి, డాక్టర్‌ నవీద్‌అహ్మద్‌, డాక్టర్‌ భానుమూర్తి, డాక్టర్‌ కన్నేగంటి భాస్కర్‌, ఆర్ట్స్‌ కళాశాల  అధ్యాపకులు లక్ష్మీనరసింహ ప్రసాద్‌, కేఎ్‌సఆర్‌ ప్రిన్సిపాల్‌ నాగర త్నమ్మ, వైద్యకళాశాల ఎనఎ్‌సఎ్‌స పోగ్రామ్‌ ఆఫీసర్లు డాక్టర్‌ పరదేశినాయుడు, డాక్టర్‌ రవినాయక్‌, ఏపీ ఎంఎ్‌సఐడీసీ ఉ ద్యోగులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement