‘వల్లభనేని వంశీ అనే వాడితో’ మాకేమీ సంబంధం లేదు: వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
ABN , First Publish Date - 2022-01-20T08:32:55+05:30 IST
‘వల్లభనేని వంశీ అనే వాడితో’ మాకేమీ సంబంధం లేదు: వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
అనంతపురం, జనవరి 19 (ఆంధ్రజ్యోతి): వల్లభనేని వంశీ అనే వాడితో మాకేమీ సంబంధం లేదని పుట్టపర్తి వైసీపీ ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి అన్నారు. బుధవారం అనంతపురం జిల్లా నల్లమాడ ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడారు. ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో పాటు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మాజీ మంత్రి, స్థానిక నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ పల్లె రఘునాథరెడ్డిలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మరీ ముఖ్యంగా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై చేసిన వ్యాఖ్యలు హాట్‌టాపిక్‌గా మారాయి. చంద్రబాబును వైసీపీ ఎమ్మెల్యేలు ఏ ఒక్కరూ ఎలాంటి విమర్శలూ చేయలేదు.. చేసిన వాడు వల్లభనేని వంశీ అంట... వాడితో మాకేమి సంబంధమంటూ చిర్రెత్తిపోయారు.