Abn logo
Jul 19 2021 @ 16:22PM

నేను రాజీనామా చేసే ప్రసక్తే లేదు: MP Raghurama raju

ఢిల్లీ: తనకు వన్ మిలియన్ యూరో ఇచ్చారని అంటున్నారు.. పేపర్లో కూడా వచ్చింది, ఎదురు డబ్బులు ఇచ్చి ఇంటర్వ్యూలు వేస్తున్నారని అంటున్నారని ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. ఇందుకు సంబంధించిన వార్తలు బార్ అండ్ బెంచ్‌లో వచ్చాయని చెప్పారు.  సోమవారం రఘురామ మీడియాతో మాట్లాడుతూ..  వైసీపీ నేతలు ఎందుకు దిగజారీ మాట్లాడుతున్నారో అర్ధం కావడంలేదని చెప్పారు. తాను ఎంపీ పదవికి రాజీనామా చేశానని కొన్ని గంటలుగా ఒక రూమర్ వస్తోందన్నారు. తాను రాజీనామా చేసే ప్రసక్తే లేదని రఘురామ తేల్చిచెప్పారు. తన లోక్‌సభ సభ్యత్వం రద్దవడం కల మాత్రమేనన్నారు. తాను స్పీకర్‌కి వివరణ అందిస్తానని తెలిపారు. ’మా జాతీయ కార్యదర్శి ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నారు‘ అని ఎద్దేవా చేశారు. స్పీకర్‌పై విజయసాయిరెడ్డి కామెంట్స్ సరికాదన్నారు. తాను పార్టీ ఉల్లంఘనలకు పాల్పడలేదని ఎంపీ రఘురామకృష్ణరాజు తెలిపారు.