దిగజారుడు మాటలొద్దు

ABN , First Publish Date - 2022-01-20T04:41:46+05:30 IST

వైసీపీ నాయకులు స్థాయిని మరిచి దిగజారుడు మాటలు మాట్లాడడం సరికాదని, అభివృద్ధి, సంక్షేమంపై వాస్తవాలు చెప్పాలని, ఆ విషయమై బహిరంగ చర్చకు రావాలని టీడీపీ నాయకులు డి మాండ్‌ చేశారు.

దిగజారుడు మాటలొద్దు
సమావేశంలో మాట్లాడుతున్న వీరారెడ్డి

అభివృద్ధిపై వాస్తవాలు చెప్పాలి :  వైసీపీకి టీడీపీ నాయకుల డిమాండ్‌

పెద్ద దోర్నాల, జనవరి 19 : వైసీపీ నాయకులు స్థాయిని మరిచి దిగజారుడు మాటలు మాట్లాడడం సరికాదని, అభివృద్ధి, సంక్షేమంపై వాస్తవాలు చెప్పాలని, ఆ విషయమై బహిరంగ చర్చకు రావాలని టీడీపీ నాయకులు  డి మాండ్‌ చేశారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో బుధవారం బట్టు సుధాకర్‌ రెడ్డి అధ్యక్షతన కార్యకర్తల సమావేశం జరిగింది.  టీడీపీ మం డల మాజీ అధ్యక్షుడు అంబటి వీరారెడ్డి మా ట్లాడుతూ వైసీపీ నాయకులు మాజీ ముఖ్య మంత్రి చంద్రబాబు, నియోజకవర్గ ఇన్‌చార్జి ఎరిక్షన్‌బాబుపై అనుచితంగా మాట్లాడడాన్ని ఆయన ఖండించారు. రెండున్నరేళ్లలో రాష్ట్రం లోగానీ, నియోజకవర్గంలోగానీ వైసీపీ చేసిన అభివృద్ధి శూన్యమన్నారు.  పేద, మధ్యతరగతి ప్రజలు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని, ఏ ఒక్కరూ సంతోషంగా లేరని అన్నారు. టీ డీపీ పాలనలో నిరుద్యోగ భృతి, రైతులకు పం ట నష్టపరిహారం, సబ్సిడీపై పరికరాలు, గ్రామాల్లో సీసీ రోడ్లు, పండుగలకు రేషన్‌ దుకాణం ద్వారా నిత్యావసర కానుకలను అంద జేసేవారని గుర్తు చేశారు. వాటన్నిటికీ వైసీపీ పాలకులు మంగళం పాడారన్నారు. మైనార్టీ సెల్‌ నాయకుడు షేక్‌ మాబు మాట్లాడుతూ  వైసీపీ వచ్చాక అన్నీ కోతలు, రద్దులేనని విమ ర్శించారు. ఉద్యోగులు రోడ్డుపైకి రావడంతో వైసీపీ అనుసరిస్తున్న చీకటి పాలన బయట పడిందన్నారు. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌  నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హా మీలు గుర్తున్నాయా అని  ప్రశ్నించారు. స మావేశంలో  రైతు సంఘం ఉపాధ్యక్షుడు జడి లక్ష్మయ్య, రావిక్రింది సుబ్బరత్నం, దొడ్డా శేషా ద్రి, ఈదర మల్లయ్య, దేసు నాగేంద్రబాబు, చంచయ్య, దానం, చెన్నారెడ్డి, చల్లా వెంకటేశ్వర్లు, శ్రీను పాల్గొన్నారు. 


Updated Date - 2022-01-20T04:41:46+05:30 IST