Advertisement
Advertisement
Abn logo
Advertisement

పురుగుల మందు తాగిన మైనర్.. కారణం తెలిసి తల్లిదండ్రలు షాక్

ఛత్తీస్‌గఢ్‌లో ఒక మైనర్ అమ్మాయి పురుగులమందు తాగింది. తమ కూతురు ఎందుకు ఇంత పని చేసిందో తల్లిదండ్రులకు అర్థం కాలేదు. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. అదృష్టం కొద్దీ డాక్టర్లు ఆమెను కాపాడగలిగారు. కాస్త కోలుకున్నాక ఆ అమ్మాయి జరిగిన విషయం చెప్పింది. ఇది విన్న ఆ తల్లిదండ్రులు షాక్‌కు గురయ్యారు. అసలేం జరిగిందంటే..


ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా జిల్లాలో కూలీ పని చేసుకునే కృష్ణ కుమార్(18) అనే వ్యక్తి తన పొరుగున నివసించే మైనర్ అమ్మాయి లత(పేరు మార్చబడినది) పై కన్నేశాడు. లత తల్లిదండ్రలిద్దరూ కూలీ పని చేసేవారు. అలా ఒకరోజు లత తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో ఆమె పురుగుల మందు తాగింది. అనుకోకుండా వారింటికి పక్కింటి ఆంటీ లత కోసం రాగా.. లత సృహ కోల్పోయి పడిఉండడం ఆమె చూసింది. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లింది. లత తండ్రికి ఫోన్ చేసి చెప్పింది.


ఆస్పత్రిలో డాక్టర్లు లత పురుగులమందు తాగిందని చెప్పారు. తమ కూతురికి అంత పని చేయాల్సిన కష్టం ఏమొచ్చిందో లత తల్లిదండ్రులకు అర్థం కాలేదు. అదృష్టం కొద్దీ డాక్టర్లు లతను కాపాడగలిగారు. కాస్త కోలుకున్నాక లత జరిగిన ఘోరం తల్లిదండ్రులకు ఏడుస్తూ చెప్పింది. ఇది విన్న ఆ తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. 


పోలీసుల కథనం ప్రకారం.. లత తల్లిదండ్రుల తమ పనికోసం రోజూలాగే బయటికివెళ్లారు. లత ఇంట్లో ఒంటరిగా ఉంది. అదే వీధిలో నివసించే కృష్ణ కుమార్ చౌహాన్ అనే వ్యక్తి ఉన్నాడు. లత ఇంట్లో ఒంటరిగా ఉండడం చూసి.. ఆమె ఇంటికి వెళ్లాడు. అక్కడ ఆమెపై అత్యాచారం చేశాడు. ఆ తరువాత ఈ విషయం ఎవరికీ చెప్పొదని బెదిరించాడు. ఇలా పలుమార్లు చేశాడు. కృష్ణ కుమార్ పెట్టే వేధింపులు తాళలేక, తల్లిదండ్రులకు విషయం చెప్పలేక లత పురుగులమందు తాగి ఆత్మహత్యకు యత్నించింది.


ప్రస్తుతం పోలీసులు.. లత తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కృష్ణ కుమార్‌ను అరెస్టు చేశారు. అతనిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement