యూడీఎఫ్‌ బకాయిలపై నోటీసులు

ABN , First Publish Date - 2020-02-28T10:54:54+05:30 IST

యూడీఎఫ్‌ బకాయిలపై నోటీసులు

యూడీఎఫ్‌ బకాయిలపై నోటీసులు

కర్నూలు(అర్బన్‌), ఫిబ్రవరి 27: రాయలసీమ యూనివర్సిటీ డెవలప్‌ మెంట్‌ ఫండ్‌ బకాయిలు 40 కళాశాలకు నోటీసులు జారీ చేశామని ఉపకులపతి ఎంఎం. నాయక్‌ తెలిపారు. గురువారం యూనివర్సిటీకి వచ్చిన ఆయన విభాగాల వారిగా కాన్ఫరెన్సు హాల్‌లో  సమీక్ష నిర్వహించారు. అనంతరం విలేఖరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ  వసతి గృహాల్లో నాన్‌ బోర్డర్ల ఏరివేతపై  వార్డెన్ల పాత్రపై తనకు ఫిర్యాదు వచ్చాయని, వాటిని  సమీక్షించి చర్యలు తీసుకోడానికి ఓ ప్రణాళిక రూపొందించామని తెలిపారు. యూనివర్సిటీ అభివృద్ధికి  ముందు మంచి వాతావరణం కల్పించినప్పుడే మెరుగైన విద్యను అందించేందుకు అవకాశం ఉంటుందన్నారు. కేవీఆర్‌, సిల్వరు జూబ్లీ కళాశాల విద్యార్థులకు అవసరమైన వాతావరణం యూనివర్సిటీలో కల్పిం చేం దుకు చర్యలు తీసుకుంటామని అన్నారు.  డాక్టరేట్‌ పట్టాల జారీ  విషయంలో  అక్రమాలు జరగకుండా కొత్త సాఫ్ట్‌వేర్‌ను ఏర్పాటు చేయబోతున్నామని తెలి పారు. యూనివర్సిటీలో సెమినార్లు, రిసెర్చు, ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్‌  తదితర అంశాలపై కూడా ప్రాధాన్యత ఇవ్వబోతున్నామన్నారు. ఆత్మకూరు డిగ్రీ కళాశాలలో విద్యార్థులు రివాల్యూయేషన్‌   ఫీజుల వివాదంపై   విచారణకు ఆదేశించామని తెలిపారు. ఈ సమావేశంలో రిజిస్ర్టార్‌ వెంకట సుందరానంద పుచ్చా, ప్రొఫెసర్లు పాల్గొన్నారు.

Updated Date - 2020-02-28T10:54:54+05:30 IST