అవినీతిపై ఆంధ్రా వర్సిటీ వీసీకి నోటీసులు

ABN , First Publish Date - 2020-09-25T08:10:15+05:30 IST

ఆర్థిక అవకతవకల ఆరోపణలపై వివరణ ఇవ్వాలని విశాఖలోని ఆంధ్రా యూనివర్సిటీ రిజిస్ట్రార్‌గా, వైస్‌ చాన్స్‌లర్‌ (పూర్తి అదనపు బాధ్యతలు)

అవినీతిపై ఆంధ్రా వర్సిటీ వీసీకి నోటీసులు

అమరావతి, సెప్టెంబరు 24(ఆంధ్రజ్యోతి): ఆర్థిక అవకతవకల ఆరోపణలపై వివరణ ఇవ్వాలని విశాఖలోని ఆంధ్రా యూనివర్సిటీ రిజిస్ట్రార్‌గా, వైస్‌ చాన్స్‌లర్‌ (పూర్తి అదనపు బాధ్యతలు)గా వ్యవహరిస్తున్న ప్రొఫెసర్‌ పీవీజీడీ ప్రసాద్‌ను హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఈ వ్యవహారంలో పూర్తి వివరాలు సమర్పించాలని సీఎస్‌, ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శులను ఆదేశించింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేస్తూ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ మహేశ్‌కుమార్‌, జస్టిస్‌ జె.ఉమాదేవితో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులిచ్చింది.


ఏయూ వీసీగా పీవీజీడీ ప్రసాద్‌ పలు అక్రమాలకు పాల్పడుతున్నారని పేర్కొంటూ టీఎన్‌ఎ్‌సఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీ ప్రణవ్‌ గోపాల్‌ హైకోర్టులో పిల్‌ వేశారు. దానిపై గురువారం విచారణ జరగ్గా.. పిటిషనర్‌ తరఫు న్యాయవాది ఎస్‌.శ్రీవెంకటేశ్‌ వాదనలు వినిపించారు, వర్సిటీ నిధులను ప్రసాద్‌ దుర్వినియోగం చేస్తున్నారని, దీని గురించి అధికారులతో పాటు, వర్సిటీ చాన్స్‌లర్‌ అయిన గవర్నర్‌కు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని వివరించారు.


Updated Date - 2020-09-25T08:10:15+05:30 IST