`కేజీఎఫ్-2` టీజర్ ఇంటర్నెట్లో సంచలనాలు సృష్టిస్తోంది. విడుదలైన గంటల్లోనే కోట్ల వ్యూస్ సాధించి సోషల్ మీడియాలో ప్రకంపనలు పుట్టించింది. రిలీజైన 12 గంటల్లోనే వివిధ భాషల్లో 25 మిలియన్ల వ్యూస్ సాధించింది. ఇక, లైక్స్ విషయంలో అయితే ప్రపంచ రికార్డులు బద్దలు కొట్టింది. అత్యంత వేగంగా 1 మిలియన్ లైక్స్, 2 మిలియన్ లైక్స్ సాధించిన తొలి టీజర్‌గా ప్రపంచ రికార్డు నెలకొల్పింది.
ఈ టీజర్‌కు సంబంధించి తాజాగా దర్శకుడు ప్రశాంత్ నీల్, హీరో యశ్, నిర్మాత నోటీసులు అందుకున్నారట. కర్ణాటక స్టేట్ యాంటీ టొబాకో సెల్ ఈ నోటీసులు పంపించిందట. దానికి కారణం టీజర్ చివర్లో చూపించిన ఓ సన్నివేశం. టీజర్ చివర్లో హీరో యశ్ గన్‌తో వరుసగా వాహనాలను షూట్ చేసి వచ్చి ఆ తుపాకీ గొట్టంతో సిగరెట్ ముట్టించుకుంటాడు. ఆ సీన్ చూపించేటపుడు `యాంటీ స్మోకింగ్ వార్నింగ్` వేయకపోవడమే ఈ అభ్యంతరానికి కారణమట. మరి, ఈ నోటీసులకు వారు ఎలా స్పందిస్తారో చూడాలి.