స్వర్ణ ప్యాలెస్ కేసు విచారణ వేగవంతం

ABN , First Publish Date - 2020-08-14T02:36:08+05:30 IST

విజయవాడ : నగరంలోని స్వర్ణ ప్యాలెస్‌లో నిర్వహిస్తున్న కోవిడ్ సెంటర్‌లో జరిగిన

స్వర్ణ ప్యాలెస్ కేసు విచారణ వేగవంతం

విజయవాడ : నగరంలోని స్వర్ణ ప్యాలెస్‌లో నిర్వహిస్తున్న కోవిడ్ సెంటర్‌లో జరిగిన అగ్ని ప్రమాదం తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన విషయం విదితమే. ఈ ఘటనలో సుమారు 10 మందికి పైగా మరణించగా పలువురు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ వేగవంతం చేశారు. మరోవైపు ప్రత్యేకంగా నియమించిన మూడు కమిటీలు సైతం త్వరలోనే ప్రభుత్వానికి ఓ నియమించింది. 


ఈ క్రమంలో గురువారం నాడు స్వర్ణ ప్యాలెస్, రమేష్ ఆస్పత్రి యాజమాన్యం, కుటుంబ సభ్యులకు పోలీసులు నోటీసులు పంపారు. విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పోలీసులు పేర్కొన్నారు. కాగా.. ఈ ఘటనలో పోలీసులు ముగ్గుర్ని అరెస్ట్ చేశారు. రమేష్‌ ఆస్పత్రి జీఎం సుదర్శన్‌, చీఫ్‌ ఆపరేటర్‌ రాజా గోపాల్‌రావుతో పాటు నైట్‌ షిఫ్ట్‌ మేనేజర్‌ వెంకటేష్‌ను సోమవారం సాయంత్రం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్వర్ణ ప్యాలెస్‌తో రమేష్‌ ఆస్పత్రి ఒప్పంద పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

Updated Date - 2020-08-14T02:36:08+05:30 IST