Abn logo
Aug 7 2021 @ 16:54PM

టీడీపీ కార్పొరేటర్లకు షోకాజ్ నోటీసులు

విశాఖ: ముగ్గురు టీడీపీ కార్పొరేటర్లకు టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ షోకాజ్ నోటీసులు ఇచ్చారు. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతూ వైసీపీకి అనుకూలంగా గత కొన్ని రోజులుగా మాట్లాడుతున్నారని ఆయన తెలిపారు. 69 వార్డు కార్పొరేటర్ కాకి గోవింద్ రెడ్డి, 41వ వార్డు కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ, 86వ వార్డు కార్పొరేటర్ లేళ్ల కోటేశ్వరరావులకు పల్లా శ్రీనివాస్ షోకాజ్ నోటీసులిచ్చారు.