Abn logo
Dec 1 2020 @ 03:38AM

ఎంబీబీఎస్‌ యాజమాన్య కోటాకు నోటిఫికేషన్‌

హైదరాబాద్‌/వరంగల్‌ అర్బన్‌, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి): ప్రైవేట్‌ వైద్య కళాశాలల్లోని ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ కోర్సుల్లో మేనేజ్‌మెంట్‌, ఎన్‌ఆర్‌ఐ కోటా సీట్ల భర్తీకి కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వ విద్యాలయం సోమవారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. డిసెంబరు 1న ఉదయం 8 గంటల నుంచి 7 వ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు బీ, సీ కేటగిరి సీట్లకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు  చేసుకోవచ్చు.  కటాఫ్‌ మార్కులను జనరల్‌ కేటగిరి అభ్యర్ధులకు 147; ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు 113గా నిర్ణయించారు. నిర్దేశించిన కటాఫ్‌ మార్కులు ఉన్న వారే బీ, సీ కేటగిరీలకు దరఖాస్తు చేసుకోవాలని  నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. 

Advertisement

తెలంగాణ మరిన్ని...

Advertisement
Advertisement