Tokyo Olympics: మిక్స్‌డ్ డబుల్స్‌ నుంచి వైదొలగిన జొకోవిక్

ABN , First Publish Date - 2021-08-01T00:58:49+05:30 IST

ప్రపంచ నంబర్ వన్ టెన్సిస్ స్టార్, 20 సార్లు గ్రాండ్ స్లామ్ చాంపియన్ అయిన నొవాక్ జొకివిక్‌కు ఈసారి ఒలింపిక్స్‌లో

Tokyo Olympics: మిక్స్‌డ్ డబుల్స్‌ నుంచి వైదొలగిన జొకోవిక్

టోక్యో: ప్రపంచ నంబర్ వన్ టెన్సిస్ స్టార్, 20 సార్లు గ్రాండ్ స్లామ్ చాంపియన్ అయిన నొవాక్ జొకివిక్‌కు ఈసారి ఒలింపిక్స్‌లో తీవ్ర పరాభం ఎదురైంది. ఎలాంటి పతకం లేకుండానే సింగిల్స్ పోరును ముగించాడు. కాంస్య పతకం కోసం స్పానిష్ టెన్నిస్ స్టార్ పాబ్లో కరెనో బుస్టాతో జరిగిన హోరాహోరీ పోరులో 4-6, 7-6, 3-6తో పరాజయం పాలయ్యాడు.


మిక్స్‌డ్ డబుల్స్ సెమీ‌స్‌లో నీనా స్టోజోనోవిక్‌తో బరిలోకి దిగి అక్కడా ఓటమి పాలయ్యాడు. తాగా కాంస్య పతకం కోసం ఆస్ట్రేలియాకు చెందిన పీర్స్ జాన్-బార్టీ జంటతో జొకోవిక్-నీనా జంట తలపడనుండగా భుజం గాయం కారణంగా జొకోవిక్ తప్పుకున్నాడు. దీంతో ఆసీస్ జంటకు కాంస్య పతకం ఖాయమైంది.  

Updated Date - 2021-08-01T00:58:49+05:30 IST