May 6 2021 @ 17:09PM

'నవంబర్ స్టోరీ' ట్రైలర్ రిలీజ్

తమన్నా ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'నవంబర్ స్టోరీ' వెబ్ సిరీస్ నుంచి తాజాగా ట్రైలర్ రిలీజ్ అయింది. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతున్న ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. డిజిటల్ వరల్డ్‌లోకి అడుగు పెట్టిన తమన్నా తెలుగులో వచ్చిన 'లెవెంత్ అవర్' వెబ్ సిరీస్‌లో నటించి ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. మరోసారి వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. క్రైమ్ థ్రిల్లర్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ వెబ్ సిరీస్ తెలుగు, తమిళ, హిందీ భాషల్లో.. డిస్నీ+హాట్ స్టార్ ఓటీటీలో మే 20 నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది. తాజాగా విడుదల చేసిన ఈ ట్రైలర్ చూస్తే ప్రముఖ క్రైమ్ నవలా రచయిత గణేశన్ కుమార్తె అనురాధ పాత్రలో తమన్నా నటించినట్టు తెలుస్తోంది. లాక్ చేయబడిన తన ఇంట్లో ఓ గుర్తు తెలియని వ్యక్తి దారుణ హత్యకు గురవుతాడు. ఆ వ్యక్తిపై 47 సార్లు పెన్నుతో పొడిచిన హంతకుడు..మృతదేహంపై పెయింట్ పోసి ఎలాంటి ఆధారాలు దొరక్కుండా చేస్తాడు. దాంతో ఈ కేసు సవాలుగా మారి అనురాధ తండ్రే ఈ హత్య చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నట్లు చూపించారు. ఇక తన తండ్రికి, ఈ హత్యకి ఎలాంటి సంబంధం లేదని నిరూపించేందుకు అనురాధ ఏం చేసిందనేది తెలియాలంటే 'నవంబర్ స్టోరీ' చూడాల్సిందే. ఈ సిరీస్‌ను తమిళ దర్శకుడు ఇంద్ర సుబ్రహ్మణ్యం తెరకెక్కించాడు. ఆనంద వికటన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మించారు. 


ఆంధ్రప్రదేశ్ మరిన్ని...