ఖాళీ స్టేడియంలోనే ఇండియా- సౌతాఫ్రికా తొలి టెస్టు

ABN , First Publish Date - 2021-12-20T23:25:15+05:30 IST

దక్షిణాఫ్రికాలో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆ దేశ క్రికెట్ బోర్డు క్రికెట్ సౌతాఫ్రికా

ఖాళీ స్టేడియంలోనే ఇండియా- సౌతాఫ్రికా తొలి టెస్టు

సెంచూరియన్: దక్షిణాఫ్రికాలో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆ దేశ క్రికెట్ బోర్డు క్రికెట్ సౌతాఫ్రికా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 26 నుంచి సెంచూరియన్ వేదికగా జరగాల్సిన తొలి టెస్టును ఖాళీ స్టేడియంలోనే నిర్వహించాలని నిర్ణయించింది. ఒమిక్రాన్ నేపథ్యంలో దక్షిణాఫ్రికా ప్రభుత్వం విధించిన నిబంధనల మేరకు ఈ నిర్ణయం తీసుకుంది.


తాజా నిర్ణయం మేరకు ఇరు బోర్డుల అధికారులు, కొందరు ప్రేక్షకులను మాత్రమే స్టేడియంలోకి అనుమతించనున్నారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో జనవరి 3 నుంచి ప్రారంభం కానున్న రెండో టెస్టు టికెట్లను విక్రయించడం లేదు. ప్రేక్షకులను స్టేడియంలోకి అనుమతించాలా? వద్దా? అన్న విషయంలో పూర్తి స్పష్టత వచ్చిన తర్వాత మాత్రమే టికెట్ల విషయంలో ఓ నిర్ణయం తీసుకుంటామని సౌతాఫ్రికా క్రికెట్ వర్గాలు తెలిపాయి.

Updated Date - 2021-12-20T23:25:15+05:30 IST