ఇక వర్చ్యువల్‌ వేడుకలు

ABN , First Publish Date - 2020-07-11T06:23:34+05:30 IST

కరోనా మూలంగా భౌతిక దూరం పాటిస్తూ జీవనం సాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. పార్టీలు, ఫంక్షన్లకు పూర్తిగా దూరమయ్యాం. అయితే పార్టీలకు భౌతికంగా వెళ్లలేకపోయినా, వర్చ్యువల్‌గా పార్టీని ఎంజాయ్‌ చేయవచ్చు

ఇక వర్చ్యువల్‌ వేడుకలు

పుట్టిన రోజు వేడుక ఘనంగా జరుపుకోవాలనుకున్నారు. కానీ కరోనా ఆ అవకాశాన్ని దూరం చేసింది. స్నేహితులను పిలవలేరు, బంధువులను ఆహ్వానించలేరు. అయితేనేం... టెక్నాలజీని ఉపయోగించుకుంటే వర్చ్యువల్‌గా పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొని స్నేహితులతో సంతోషాలు పంచుకోవచ్చు. ఎలా అంటే...


కరోనా మూలంగా భౌతిక దూరం పాటిస్తూ జీవనం సాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. పార్టీలు, ఫంక్షన్లకు పూర్తిగా దూరమయ్యాం. అయితే పార్టీలకు భౌతికంగా వెళ్లలేకపోయినా, వర్చ్యువల్‌గా పార్టీని ఎంజాయ్‌ చేయవచ్చు. ఇందుకు వీడియో కాలింగ్‌ యాప్స్‌ బాగా ఉపయోగపడతాయి.


జూమ్‌తో జామ్‌ జామ్‌గా...

వీడియో కాన్ఫరెన్స్‌ కోసం జూమ్‌ చక్కగా ఉపయోగపడుతుంది. స్మార్ట్‌ఫోన్‌లో జూమ్‌ యాప్‌ లేదా డెస్క్‌టాప్‌ నుంచి జూమ్‌ ఉపయోగించవచ్చు. 

  • ముందుగా జూమ్‌ అకౌంట్‌ లేకపోతే కనుక వెబ్‌సైట్‌లోకి వెళ్లి న్యూ అకౌంట్‌ క్రియేట్‌ చేసుకోవాలి. గూగుల్‌, ఫేస్‌బుక్‌ అకౌంట్‌తోనూ జూమ్‌ సర్వీసును ఉపయోగించుకోవచ్చు.
  • అకౌంట్‌ను క్రియేట్‌ చేశాక ‘హోస్ట్‌ ఎ మీటింగ్‌’ ఆప్షన్‌ను ఎంచుకుని, ‘విత్‌ వీడియో ఆన్‌’ బటన్‌పై క్లిక్‌ చేయాలి.
  • ఇప్పుడు జూమ్‌ వెబ్‌ అప్లికేషన్‌ను ఓపెన్‌ చేయాలా అని ఒక మెసేజ్‌ కనిపిస్తుంది. అక్కడే ఉన్న ‘ఓపెన్‌ జూమ్‌’ బటన్‌పై క్లిక్‌ చేయాలి.
  • సెటప్‌ పూర్తయ్యాక ఎడమవైపు పై భాగంలో ఉన్న ‘ఇన్ఫో బటన్‌’పై క్లిక్‌ చేసి ఇన్విటేషన్‌ యూఆర్‌ఎల్‌ను పొందాలి.
  • యూఆర్‌ఎల్‌ను కాపీ చేసుకుని ఎవరినైతే వీడియో కాన్ఫరెన్స్‌లోకి ఆహ్వానిస్తున్నారో వారికి యూఆర్‌ఎల్‌ లింక్‌ షేర్‌ చేయాలి. 
  • ఆ లింక్‌ను క్లిక్‌ చేయడం ద్వారా బంధువులు, స్నేహితులు వీడియో ఛాట్‌లో పాల్గొనవచ్చు.
  • కావాలంటే మీ వీడియో ఛాట్‌కు పాస్‌వర్డ్‌ ప్రొటెక్షన్‌ పెట్టుకోవచ్చు. మీరు ఆహ్వానించిన సభ్యులందరూ వచ్చాక ‘లాక్‌ మీటింగ్‌’ ఫీచర్‌ను ఎంచుకోవడం ద్వారా మీ పార్టీని లాక్‌ చేసుకోవచ్చు.


గిఫ్ట్‌లు వినూత్నంగా...

ఈ సమయంలో గిఫ్ట్‌లను కూడా వర్చ్యువల్‌గానే అందించాలి. ఆన్‌లైన్‌ డెలివరీ ద్వారా గిఫ్ట్‌లు పంపించవచ్చు.

ఇ-బుక్స్‌ : ఇంటిపట్టునే ఉంటున్న ఈ సమయంలో ఇ-బుక్‌ని గిఫ్ట్‌గా అందించడం బెస్ట్‌ ఛాయిస్‌గా చెప్పుకోవచ్చు. అమెజాన్‌లో ఇ-బుక్‌ని సెలక్ట్‌ చేసి ‘గివ్‌ యాజ్‌ గిఫ్ట్‌’ ఆప్షన్‌ని ఎంచుకుని మీ స్నేహితుడి ఇ-మెయిల్‌ అడ్రస్‌ టైప్‌ చేస్తే సరిపోతుంది.

గిఫ్ట్‌ కార్డులు : బర్త్‌డే థీమ్‌ ఇ-గిఫ్ట్‌ కార్డుని డిజైన్‌ చేసి పంపించవచ్చు. ఇ-మెయిల్‌ ద్వారా లేదా వాట్సప్‌లో షేర్‌ చేసుకోవచ్చు. ‘కన్వా’ వంటి సర్వీసులను ఉపయోగించుకుని ఇ-కార్డులను డిజైన్‌ చేసుకోవచ్చు.


స్కైప్‌తో సరదాగా...

ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌, మ్యాక్‌, విండోస్‌ డివైజ్‌... ఏది ఉపయోగిస్తున్నా స్కైప్‌తో గ్రూప్‌ వీడియో చాట్‌ క్రియేట్‌ చేసుకోవచ్చు. 

  • మీరు ఉపయోగిస్తున్న డివైజ్‌లో స్కైప్‌ ఇన్‌స్టాల్‌ చేసుకున్నాక ‘+’ న్యూ చాట్‌ బటన్‌పై క్లిక్‌ చేయాలి. తరువాత లిస్ట్‌లో ‘న్యూ గ్రూప్‌ చాట్‌’ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. 
  • పేరు, ఫొటో జత చేసి కుడి వైపు యారో బటన్‌పై క్లిక్‌ చేసి గ్రూప్‌ను క్రియేట్‌ చేయాలి.
  • ఒకసారి గ్రూప్‌ లైవ్‌ మొదలయ్యాక స్నేహితులను, బంధువులను యాడ్‌ చేసుకోవడం ప్రారంభించవచ్చు. 
  • యూజర్‌నేమ్‌తో సెర్చ్‌ చేసి సెలెక్ట్‌ చేసుకోవడం ద్వారా కూడా మెంబర్స్‌ను జత చేసుకోవచ్చు.
  • ఇప్పుడు వీడియోకాల్‌ బటన్‌పై క్లిక్‌ చేసి వీడియో కాన్ఫరెన్స్‌ ప్రారంభించాలి.
  • ఒకేసారి 49 మంది కనెక్ట్‌ కావచ్చు. కాబట్టి ముఖ్యమైన బంధువులు, స్నేహితులు మిస్‌ అయ్యే ఛాన్సే లేదు.


గూగుల్‌ హ్యాంగవుట్స్‌తో...

గూగుల్‌ అకౌంట్‌తో సులభంగా గూగుల్‌ హ్యాంగవుట్స్‌ను సెట్‌ చేసుకోవచ్చు. 

  • యాప్‌లోకి సైనిన్‌ అయ్యాక మెనూలో ఉన్న కాంటాక్ట్స్‌ ఐకాన్‌పై క్లిక్‌ చేయాలి.
  • తరువాత ‘న్యూ కాన్వర్జేషన్‌’ ఆప్షన్‌ను 


ఎంచుకుని, లిస్ట్‌లో ‘న్యూ గ్రూప్‌’ బటన్‌పై క్లిక్‌ చేయాలి. 

  • ఇప్పుడు గ్రూప్‌కు ఒక పేరు పెట్టాలి. తరువాత పేరు, ఇ-మెయిల్‌ లేదా ఫోన్‌ నెంబర్‌తో మెంబర్స్‌ను జత చేసుకుంటూ వెళ్లాలి. 
  • అందరినీ యాడ్‌ చేసుకోవడం పూర్తయ్యాక గ్రూప్‌ పేరు పక్కన ఉన్న వీడియో కాల్‌ బటన్‌పై క్లిక్‌ చేయడం ద్వారా వీడియో కాన్ఫరెన్స్‌ ప్రారంభించవచ్చు.
  • ఒకసారి 25 మంది సభ్యుల వరకు వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొనవచ్చు.

Updated Date - 2020-07-11T06:23:34+05:30 IST