ఈరోజు నుంచి మహిళలకూ లోకల్ రైళ్లలో ప్రవేశం

ABN , First Publish Date - 2020-10-21T16:00:25+05:30 IST

మహానగరం ముంబైలోని లోకల్ రైళ్లలో ఈరోజు నుంచి మహిళలు ప్రయాణించేందుకు రైల్వే మంత్రిత్వశాఖ అనుమతినిచ్చింది.

ఈరోజు నుంచి మహిళలకూ లోకల్ రైళ్లలో ప్రవేశం

ముంబై: మహానగరం ముంబైలోని లోకల్ రైళ్లలో ఈరోజు నుంచి మహిళలు ప్రయాణించేందుకు రైల్వే మంత్రిత్వశాఖ అనుమతినిచ్చింది. ఈ విషయాన్ని కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయల్ ఒక ట్వీట్ ద్వారా తెలియజేశారు. ఈరోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకూ, సాయంత్రం 7 గంటల తరువాత రైళ్లు నడిచేంత వరకూ లోకల్ రైళ్లలో మహిళలు ప్రయాణించవచ్చని పీయూష్ గోయల్ తెలిపారు. 


తాము లోకల్ రైళ్లలో మహిళల ప్రయాణానికి అనుమతి ఇచ్చేందుకు ఎప్పుడో సిద్ధంగా ఉన్నామని, అయితే మహారాష్ట్ర సర్కారు నుంచి లేఖ వచ్చిన తరువాతనే దీనికి అనుమతినిచ్చామని తెలిపారు. దీనికి ముందు అక్టోబరు 16న కేంద్ర ప్రభుత్వం లోకల్ రైళ్లలో మహిళలు ప్రయాణించేందుకు అనుమతినివ్వడాన్ని మహారాష్ట్ర సర్కారు వ్యతిరేకించింది. అయితే ఇప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వం కూడా లోకల్ రైళ్లలో మహిళలు ప్రయాణించేందుకు అనుమతినిచ్చింది. 


Updated Date - 2020-10-21T16:00:25+05:30 IST