Abn logo
Mar 26 2020 @ 08:36AM

పేరుకుపోతున్న మృతదేహాలు.. రోజూ 20 మంది భారతీయులు మృతి

(ఆంధ్రజ్యోతి గల్ఫ్‌ ప్రతినిధి): గల్ఫ్‌ దేశాల్లో విమానాల రాకపోకలను నిలిపివేయడంతో కొన్ని రోజులుగా ఇక్కడ భారతీయుల మృతదేహాలు పెరిగిపోతున్నాయి. గల్ఫ్‌ దేశాల్లో సగటున ప్రతి రోజు 20 మంది ప్రవాస భారతీయులు మరణిస్తుండగా అందులో దాదాపు ఐదుగురు తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు ఉంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో కర్ఫ్యూ నిబంధనల వల్ల మృతదేహాల తరలింపు లేదా స్థానికంగా అంత్యక్రియలు జరపడంలో జాప్యం జరుగుతుంది. భారతీయ ఎంబసీలు నో అబ్జక్షన్‌ సర్టిఫికెట్లు జారీ చేస్తున్నా మృతదేహాలను భారతదేశానికి పంపలేకపోతున్నారు. అదే విధంగా, ప్రజలు గూమిగూడడం, జన సంచారంపై ఆంక్షలున్నాయి. దుబాయి, షార్జాల్లో శ్మశాన వాటికల్లోకి పరిమిత సంఖ్యలో మృతుల బంధువులను అనుమతిస్తున్నారు. 

Advertisement
Advertisement
Advertisement