Abn logo
Jul 7 2020 @ 21:04PM

ఎన్నారైను దారుణంగా హత్య చేసి.. పంజాబ్‌లో..

పగ్వారా: పంజాబ్‌లో ఓ ఎన్నారైను దుండగులు దారుణంగా హత్య చేసి రూ. 8 లక్షల నగదును దొంగిలించారు. పగ్వారా నగరంలో సోమవారం అర్థరాత్రి ఈ ఘటన చోటుచేసుకున్నట్టు ఆ ప్రాంత పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హాన్స్ రాజ్ బస్రా(65) అనే ఎన్నారై యూకేలో స్థిరపడ్డారు. ఇటీవల ఆయన యూకే నుంచి భారత్‌కు వచ్చారు. జలాంధర్‌లోని తన ఫ్లాట్‌ను అమ్మిన రాజ్ బస్రా ఇదే సమయంలో మరో ఫ్లాట్‌ను కొనుగోలు చేశారు. ఈ లావాదేవీలకు సంబంధించిన రూ.8 లక్షల డబ్బును రాజ్ బస్రా తన ఇంట్లో పెట్టుకున్నారు. అయితే దుండగులు రాజ్ బస్రా ఇంట్లో చొరబడి.. అతడిని దారుణంగా హత్యచేసి డబ్బును దొంగిలించారు. రాజ్ బస్రాను కత్తితో దాడి చేసినట్టు పోలీసులు తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేశామని.. విచారణ జరుపుతున్నట్టు పగ్వారా పోలీసులు పేర్కొన్నారు. రాజ్ బస్రాను కొద్ది రోజుల నుంచి నిందితులు అనుసరిస్తూ వచ్చినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. రాజ్ బస్రాను పక్కా ప్లాన్‌తోనే హత్య చేసి ఉండొచ్చని పోలీసులు చెబుతున్నారు.

Advertisement
Advertisement
Advertisement