భార్య అనుమానాస్పద మృతి.. ఎన్నారై భర్తను అదుపులోకి తీసుకుని విచారిస్తే.. ఆయన చెప్పింది విని పోలీసులు షాక్!

ABN , First Publish Date - 2021-07-22T22:20:52+05:30 IST

క్రైమ్ థ్రిల్లర్‌ను తలపించే ఓ రియల్ స్టోరీ కర్ణాటక రాష్ట్రం ఉడిపి జిల్లాలో జరిగింది. భార్యను హతమార్చేందుకు ఎన్నారై భర్త కాంట్రాక్ట్ కిల్లర్లకు ఏకంగా రూ. 2లక్షల సుపారీ ఇచ్చిన ఉదంతం ఇది. దాంతో దుబాయ్ నుంచి వచ్చిన ఇద్దరు సుపారీ కిల్లర్లు మహిళను హత్య చేసి అక్కడి నుంచి జారుకున్నారు.

భార్య అనుమానాస్పద మృతి.. ఎన్నారై భర్తను అదుపులోకి తీసుకుని విచారిస్తే.. ఆయన చెప్పింది విని పోలీసులు షాక్!
భర్త రామక్రిష్ణతో విశాలా

ఉడిపి, కర్ణాటక: క్రైమ్ థ్రిల్లర్‌ను తలపించే ఓ రియల్ స్టోరీ కర్ణాటక రాష్ట్రం ఉడిపి జిల్లాలో జరిగింది. భార్యను హతమార్చేందుకు ఎన్నారై భర్త కాంట్రాక్ట్ కిల్లర్లకు ఏకంగా రూ. 2లక్షల సుపారీ ఇచ్చిన ఉదంతం ఇది. దుబాయ్ నుంచి వచ్చిన ఇద్దరు సుపారీ కిల్లర్లు మహిళను హత్య చేసి అక్కడి నుంచి జారుకున్నారు. ఇక ఆ సమయంలో ఇంట్లో భర్త లేకపోవడంతో చుట్టుపక్కల వారు నిజంగా ఎవరో హత్య చేసి ఉంటారని భావించారు. కానీ, మహిళ చనిపోయిన గదిలో పోలీసులకు దొరికిన కొన్ని ఆధారాలు అనుమానం కలిగించాయి. దాంతో ఈ కేసు విచారణ కోసం పోలీసులు ఓ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం దర్యాప్తు ముమ్మరం చేశారు. దీనిలో భాగంగా ఎన్నారై భర్తపై ప్రత్యేక నిఘా పెట్టారు. ఈ క్రమంలో అతడి ప్రవర్తనపై అనుమానం రావడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అతడు చెప్పిన విషయాలు విని పోలీసులు షాకయ్యారు. 


పూర్తి విరాల్లోకి వెళ్తే.. రామక్రిష్ణ గనిగా, విశాలా గనిగా భార్యభర్తలు. కొన్నాళ్లుగా దుబాయ్‌లో ఉంటున్నారు. జూలై 2న విశాలా భర్తతో కలిసి స్వస్థలమైన బ్రహ్మవర్‌లోని కుమారగోడుకు వచ్చింది. దుబాయ్ నుంచి వచ్చిన 10 రోజుల తర్వాత అంటే.. జూలై 12న విషాలా అనుమానాస్పద స్థితిలో తన ఇంట్లోనే హత్యకు గురైంది. ఆ సమయంలో పోలీసులకు ఆమె చనిపోయిన గదిలోని కొన్ని వస్తువులు అనుమానం కలిగించాయి. దాంతో ఈ కేసును ఛాలెంజ్‌గా తీసుకున్న పోలీసులు.. ఐదుగురు అధికారులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తు మొదలెట్టారు. భర్త రామక్రిష్ణపై నిఘా పెట్టిన ఈ బృందంలో అతడి ప్రవర్తనపై అనుమానంతో అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ విచారణలో మొదట భార్య హత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదని బుకాయించాడు. కానీ, పోలీసులు తమదైనశైలిలో విచారించడంతో షాకింగ్ విషయాలు బయటపెట్టాడు. 


గత కొన్నాళ్లుగా భార్య విశాలాతో తనకు మనస్పర్థులు ఉన్నాయని, ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవని చెప్పాడు. దాంతో ఎలాగైన భార్యను అంతమొందించాలని అనుకున్నట్లు పోలీసులకు తెలిపాడు. దీనిలో భాగంగానే ఈ ఏడాది మార్చిలో దుబాయ్‌లో ఉండే ఇద్దరు కాంట్రాక్ట్ కిల్లర్లును కలిసి తన భార్యను హతమార్చేందుకు రూ. 2లక్షల సుపారీ ఇచ్చాడు. అప్పటి నుంచి వారితో కాంటాక్ట్‌లోనే ఉంటున్నాడు. ఈ క్రమంలో భార్య, కూతురి తీసుకుని ఈ నెల 2న స్వస్థలమైన బ్రహ్మవర్‌లోని కుమారగోడుకు వచ్చాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత రెండు మూడు రోజులకు ఇద్దరు వ్యక్తులను ఇంటికి తీసుకొచ్చి తన మిత్రులుగా భార్య విశాలాకు పరిచయం చేశాడు. ఆ ఇద్దరు రామక్రిష్ణకు విశాలా మర్డర్‌పై ఓ ప్లాన్ చెప్పారు. వారు చెప్పిన ప్లాన్ అమలు కోసం ఎదురుచూస్తున్న రామక్రిష్ణ ఈ నెల 12న ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. 


అనంతరం ఇంట్లో ఉన్న భార్యకు ఫోన్ చేశాడు. ఇంతకుముందు ఆమెకు పరిచయం చేసిన తన ఇద్దరు స్నేహితులు ఇంటికి వస్తారని, వారికి ఇంట్లో ఉన్న ఓ పార్శిల్ ఇవ్వాల్సిందిగా చెప్పాడు. పది నిమిషాల తర్వాత ఆ ఇద్దరు రామక్రిష్ణ ఇంటికి వెళ్లారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న విశాలాపై దాడిచేసి చంపేశారు. అనంతరం ఆమె ఒంటిపై ఉన్న నగలను తీసుకుని అక్కడి నుంచి పరారయ్యారు. నగల కోసమే ఆమెను దుండగులు హత్య చేసి ఉంటారని పోలీసులు భావించాలనేది రామక్రిష్ణతో పాటు ఆ ఇద్దరు సుపారీ కిల్లర్ల స్కెచ్. అంతా వారు అనుకున్నట్లే జరిగింది. ఎవరో అభరణాల కోసమే విశాలాను హత్య చేసి ఉంటారని బంధువులు, కుటుంబ సభ్యులు సైతం భావించారు. 


కానీ, విశాలా చనిపోయిన చోట పోలీసులకు కొన్ని వస్తువులు అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులు ఇది కచ్చితంగా ఎవరో ప్రణాళిక ప్రకారం హత్య చేశారని అనుమానించారు. దీనిలో భాగంగా విచారణ కోసం ఐదుగురు పోలీసులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. అటు రామక్రిష్ణపై నిఘా పెట్టడం.. అతడు అనుమానాస్పదంగా ప్రవర్తించడంతో అదుపులోకి తీసుకుని విచారించారు. దాంతో ఈ మర్డర్ మిస్టరీ వీడింది. రామక్రిష్ణ సమాచారం మేరకు అతడి వద్ద సుపారీ తీసుకున్న స్వామినాథన్ నిషద్ అనే ఓ కిల్లర్‌ను పోలీసులు మధ్యప్రదేశ్‌లో అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం రెండో కిల్లర్ కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.     

Updated Date - 2021-07-22T22:20:52+05:30 IST