America నుంచి అత్తారింటికి వచ్చి మరీ ఓ NRI నిర్వాకమిది.. ఆస్పత్రి పాలయిన భార్య.. అసలేం జరిగిందంటే..

ABN , First Publish Date - 2021-09-19T01:58:35+05:30 IST

అమెరికా నుంచి అత్తారింటికి వచ్చిన ఓ ఎన్నారై అల్లుడు చేసిన నిర్వాకమిది. కూతురితో గొడవపడి ఆమెను గొంతునొక్కి చంపాబోతుంటే అల్లుడిని అడ్డుకోబోయిందా అత్త.

America నుంచి అత్తారింటికి వచ్చి మరీ ఓ NRI నిర్వాకమిది.. ఆస్పత్రి పాలయిన భార్య.. అసలేం జరిగిందంటే..

హోషియార్పూర్: అమెరికా నుంచి అత్తారింటికి వచ్చిన ఓ ఎన్నారై అల్లుడు చేసిన నిర్వాకమిది. కూతురితో గొడవపడి ఆమెను గొంతునొక్కి చంపాబోతుంటే అల్లుడిని అడ్డుకోబోయిందా అత్త. అదే ఆమె పాలిట యమపాశం అవుతుందని ఊహించలేకపోయింది. తల్లీకూతురిపై కోపంతో రగిలిపోయిన దుర్మార్గుడు తనతోపాటు తెచ్చుకున్న తుపాకీతో మొదట అత్తపై కాల్పులు జరిపాడు. అనంతరం భార్యను కాల్చి అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ కాల్పుల్లో అత్త అక్కడికక్కడే చనిపోగా.. తీవ్రంగా గాయపడిన భార్య ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ దారుణ ఘటన గత ఆదివారం పంజాబ్‌లోని హోషియార్పూర్‌లో చోటు చేసుకుంది. పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. 


ఇవి కూడా చదవండి..

Kuwait లో ఎడమ చేతితో తినకూడదా..? ఆ దేశంలో ఉండగా ఏమేం చేయకూడదంటే..

మిస్‌ యూనివర్స్‌ సింగపూర్‌గా తెలుగమ్మాయి


చబ్బెవాల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జండోలి గ్రామానికి చెందిన బల్వీర్ కౌర్ కూతురు షవ్‌దీప్ కౌర్‌కు అమెరికాలో ఉండే బర్షింగ్‌పురాకు చెందిన మన్దీప్ సింగ్‌తో నాలుగేళ్ల క్రితం వివాహమైంది. షవ్‌దీప్ కౌర్‌ ప్రస్తుతం ఇక్కడే ఉంటోంది. దీంతో గత శనివారం మన్దీప్ సింగ్ అమెరికా నుంచి అత్తారింటికి వచ్చాడు. ఆ తర్వాతి రోజు ఉదయం భార్యతో ఘర్షణకు దిగిన మన్దీప్ ఆమె గొంతునొక్కి చంపాబోయాడు. అది గమనించిన బల్వీర్ కౌర్ తన కూతురును విడిపించే ప్రయత్నం చేసింది. దాంతో కోపోద్రిక్తుడైన మన్దీప్ తనతో పాటు తెచ్చుకున్న తుపాకీతో మొదట అత్తాపై కాల్పులు జరిపాడు. దాంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. ఆ తర్వాత భార్యను కూడా అదే తుపాకీతో కాల్చి, ఇంట్లోంచి వారు బయటకి రాకుండా తలుపులకు గొళ్లెం పెట్టి అక్కడి నుంచి పరారయ్యాడు. 


అయితే, షవ్‌దీప్ ఏడుపు విన్న చుట్టుపక్కల వారు వచ్చి తలుపు తెరిచి చూశారు. అప్పటికే బల్వీర్ కౌర్ రక్తపు మడుగులో అచేతనంగా పడి ఉంది. షవ్‌దీప్ తీవ్ర గాయాలతో విలవిలలాడుతోంది. దాంతో వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించడంతో పాటు షవ్‌దీప్‌ను చికిత్స కోసం హోషియార్పూర్ ఆస్పత్రికి తరలించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడి వైద్యులు జలంధర్ ఆస్పత్రికి పంపించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు బల్వీర్ కౌర్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. డీఎస్‌పీ సత్వీర్ సింగ్ మాట్లాడుతూ ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. నిందితుడు మన్దీప్ సింగ్‌‌పై 302, 307 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, దేశం విడిచిపెట్టి పారిపోకుండా అధికారులను అప్రమత్తం చేసినట్లు చెప్పారు. వీలైనంత త్వరగా నిందితుడిని అదుపులోకి తీసుకుంటామన్నారు.       


Updated Date - 2021-09-19T01:58:35+05:30 IST