Abn logo
Oct 12 2021 @ 14:37PM

బావిలో దూకి బలవన్మరణానికి పాల్పడిన NRI..!

ఉడుపి, కర్నాటక: 57 ఏళ్ల ఓ ఎన్నారై ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన కర్నాటక రాష్ట్రం షిర్వాలోని నెక్కేర్‌లో సోమవారం చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న ఓ బావిలో దూకి సైమన్ డిసౌజా అనే ఎన్నారై బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. సైమన్ గత పాతికేళ్లుగా సౌదీ అరేబియాలో సాఫ్ట్‌వేర్ వ్యాపారంలో పనిచేస్తున్నట్లు సమాచారం. సామాజిక కార్యక్రమం కోసం ఇటీవలే స్వస్థలమైన నెక్కేర్‌‌కు వచ్చినట్లు బంధువులు తెలిపారు. ఎప్పుడు సామాజిక కార్యక్రమాల్లో చూరుకుగా పాల్గొనే ఆయన పాంబూర్ మానస పునరావాస కేంద్రం నిర్వాహక కమిటీ సభ్యుడు. అలాగే షిర్వాలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో ఆరోగ్య రక్ష కమిటీ సభ్యుడిగా కూడా ఉన్నట్లు తెలుస్తోంది. సైమన్‌కు భార్య, ఇద్దరు పిల్లలు, తల్లి ఉన్నారు. 

అయితే, ఆయన ఎందుకు ఇలా అర్థాంతరంగా జీవితం ముగించాల్సి వచ్చిందనేది తెలియాల్సి ఉంది. ఉడుపికి చెందిన ఫైర్ అండ్ ఎమర్జెన్సీ సర్వీసెస్ అధికారులు స్థానికుల సైమాచారంతో ఘటనాస్థలికి చేరుకుని సైమన్ బాడీని బావి నుంచి బయటకు తీశారు. అనంతరం పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. షిర్వా పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సైమన్ మరణంతో కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. ఆయన స్వస్థలం నెక్కేర్‌లో విషాదం అలుముకుంది.        

ఇవి కూడా చదవండిImage Caption

తాజా వార్తలుమరిన్ని...