నోముల భగత్‌ను గెలిపించాలని ఎన్నారై టీఆర్ఎస్ విజ్ఞప్తి

ABN , First Publish Date - 2021-04-16T13:57:41+05:30 IST

ఈరోజు హాలియాలో ఎన్నారై తెరాస ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎన్నారై టీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం, ఎన్నారై టీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి, కోశాధికారి సతీష్ రెడ్డి గొట్టెముక్కల, సీనియర్ నాయకులు రాజ్ కుమార్ శానబోయిన, మల్లేష్ పప్పుల, శ్రీనివాస్ వల్లాల పాల్గొన్నారు.

నోముల భగత్‌ను గెలిపించాలని ఎన్నారై టీఆర్ఎస్ విజ్ఞప్తి

సాగర్ ప్రజలంతా కేసీఆర్ వెంటే ఉన్నారు: అనిల్ కూర్మాచలం మరియు అశోక్ గౌడ్ దూసరి

హాలియా: ఈరోజు హాలియాలో ఎన్నారై తెరాస ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎన్నారై టీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం, ఎన్నారై టీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి, కోశాధికారి సతీష్ రెడ్డి గొట్టెముక్కల, సీనియర్ నాయకులు రాజ్ కుమార్ శానబోయిన, మల్లేష్ పప్పుల, శ్రీనివాస్ వల్లాల పాల్గొన్నారు. అనిల్ కూర్మాచలం మాట్లాడుతూ నాగార్జునసాగర్ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపుకోసం దాదాపు రెండు వారాలకు పైగా వివిధ మండలాల్లో ఎన్నారై టీఆర్ఎస్ బృందం ఇంటింటి ప్రచారం నిర్వహించామని, సాగర్ నియోజకవర్గ పరిధిలో కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ప్రత్యేక కరపత్రం ద్వారా గడప గడపకు తెలిసేలా విస్తృత ప్రచారం చేశామని అనిల్ కూర్మాచలం తెలిపారు. నేడు కేసీఆర్ పాలన దేశానికే ఆదర్శంగా ఉందని, ఒక పక్క సంక్షేమం అభివృద్దే కాకుండా రాష్ట్రానికి పెట్టుబడులు రావాలని టీయస్ - ఐపాస్ లాంటి పాలసీలే కాకుండా కేటీఆర్ విదేశాలకు వెళ్లి మన రాష్ట్రానికి పెట్టుబడుల్ని తేవడానికి ఎంతో కృషి చేస్తున్నారని గుర్తు చేశారు.


యువతకు ఉపాధి కల్పించడమే కాకుండా రాష్ట్ర సంపదను పెంచి పేదలకు పంచాలనే స్పూర్తితో టీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ పని చేస్తున్నారని తెలిపారు. మరి ఇలాంటి ప్రభుత్వాన్ని, ఇలాంటి నాయకత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి పైనా ఉందన్నారు. నేడు సాగర్‌లో భగత్ గెలుపుతో నియోజకవర్గం రెట్టింపు అభివృద్ధితో ముందుకు వెళ్తుందని, నోముల నర్సింహయ్య ఆశయాలను ముందుకు తీసుకెళ్లడానికి మీ ముందుకు వచ్చాడని ఆశీర్వదించి అసెంబ్లీకి పంపితే మీకు అందుబాటులో ఉంటూ సేవ చేస్తాడని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఢిల్లో లేదు గల్లీలో లేదని వారికి పొరపాటున ఒక్క ఓటు వేసినా అది వృధా అవుతుందని ఓటరులంతా విజ్ఞతతో ఓటేసి కేసీఆర్ నాయకత్వాన్ని బలపరచాలన్నారు. 17వ తేదీన జరిగే పోలింగ్‌లో నోముల భగత్‌కు చెందిన కారు గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. 


ఎన్నారై టీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి మాట్లాడుతూ దాదాపు పదేళ్లుగా సాధారణ ఎన్నికల్ల నుండి ఉపఎన్నికల వరకు, మున్సిపాలిటీ నుండి పార్లమెంట్ వరకు దాదాపు ప్రతీ ఎన్నికల్లో అటు సోషల్ మీడియా ద్వారా ఇటు ప్రత్యక్షంగా వచ్చి బాధ్యత గల టీఆర్ఎస్ నాయకులుగా ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నామని తెలిపారు. అదే స్పూర్తితో గత కొన్ని వారాలుగా సాగర్ నియోజకవర్గ పరిధిలోని వివిధ మండలాల్లో విస్తృతంగా పర్యటించి ప్రచారం నిర్వహించామని పేర్కొన్నారు. ప్రజలంతా టీఆర్ఎస్ వైపే ఉన్నారని, ప్రత్యర్ధులు చివరి నిమిషం వరకు ఓటర్లను ప్రలోభాలకు గురి చేసే అవకాశం ఉంటుందన్నారు. కానీ, ప్రజలంతా విజ్ఞతతో ఓటేసి నోముల భగత్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలని అశోక్ గౌడ్ కోరారు. 

Updated Date - 2021-04-16T13:57:41+05:30 IST