జీహెచ్ఎంసీలో గులాబీ జెండా ఎగరడం ఖాయం: ఎన్నారై టీఆర్ఎస్ నేతలు

ABN , First Publish Date - 2020-11-23T01:52:22+05:30 IST

జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నారై టీఆర్ఎస్ విభాగం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించింది.

జీహెచ్ఎంసీలో గులాబీ జెండా ఎగరడం ఖాయం: ఎన్నారై టీఆర్ఎస్ నేతలు

హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నారై టీఆర్ఎస్ విభాగం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించింది. ఈ సామావేశంలో ఆ పార్టీ రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ వై. సతీష్ రెడ్డి..  ప్రపంచం వ్యాప్తంగా ఉన్న ఎన్నారై టీఆర్ఎస్ పార్టీ నాయకులు, మద్దతుదారులు పాల్గొన్నారు. జీహెచ్ఎంసీలో టీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపుకోసం కోసం సోషల్ మీడియా ద్వారా నిర్వహించే ప్రచారంపై ఎన్నారైలకు సతీష్ రెడ్డి దిశా నిర్దేశం చేశారు. 


సతీష్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గత ఆరు సంవత్సరాల్లో హైదరాబాద్ ఎంతో అభివృద్ధి చెంది, దేశంలో అగ్రగామిగా నిలిచిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ నాయకత్వంలో హైదరాబాద్ దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. పలుపథకాల ద్వారా హైదరాబాద్‌లోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేసిందన్నారు. ఎన్నారైలు ప్రత్యక్షంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేకపోయినా సోషల్ మీడియా ద్వారా విస్తృత ప్రచారం నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రభుత్వం చేసిన అభివృద్ధిని వివరిస్తూనే ప్రతిపక్షాల అసత్య ప్రచారాలని తిప్పి కొట్టాలని తెలిపారు. 



ఎన్నారై టీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం మాట్లాడుతూ.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సైనికుల్లా పని చేసి బల్దియా పీఠంపై గులాబీ జెండా ఎగురవెయ్యడానికి కృషి చెయ్యాలని కోరారు. ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్‌లో మత విద్వేషాలు రెచ్చగొట్టి, అభివృద్ధికి ఆటంకం కలిగించాలని బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఆ పార్టీ చేసే విష ప్రచారాల్ని తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ సౌత్ ఆఫ్రికా అధ్యక్షుడు గుర్రాల నాగరాజు మాట్లాడుతూ.. దేశంలో ఏ పార్టీకి లేని విధంగా టీఆర్ఎస్‌కు ప్రపంచ నలుమూలలా శాఖలతో పాటు లక్షల మంది కార్యకర్తలున్నారన్నారు. కార్యకర్తలంతా క్రియాశీలకంగా పనిచేసి సోషల్ మీడియా ద్వారా హైదరాబాద్ అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని తెలిపారు.


ఈ సమావేశంలో అశోక్ గౌడ్ దూసారి(యూకే), అరవింద్ తక్కలపెల్లి (అమెరికా), జువ్వాడి శ్రీనివాస్ (దుబాయ్), సతీష్ కుమార్ (బహరేన్), శ్యామ్ బాబు ఆకుల (డెన్మార్క్), చిట్టిబాబు చిరుత(మలేసియా), నీల శ్రీనివాస్ (ఫ్రాన్స్ ), మేడిపెల్లి వివేక్(ఆస్ట్రియా) ,శ్రీనివాస్ ఎముల(నార్వే), రాజేష్ రాపోలు (ఆస్ట్రేలియా), శ్రీధర్ (స్విట్జర్లాండ్), శ్రీధర్ అబ్బగొని (ఖతార్), అరవింద్ గుంత (జెర్మనీ), మొహమ్మద్ హమీద్ (సౌదీ), షేఖ్ అహ్మద్ (ఒమాన్), అభిలాష గొడిశాల (కువైట్), గంగా రెడ్డి (మాల్టా ), ప్రసాద్ రావు (నార్వే), నవీన్ రెడ్డి (లండన్), సృజన్ రెడ్డి చాడ (లండన్), నిరంజన్ పొద్దుటూరి(అమెరికా) మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపునకు సోషల్ మీడియా ద్వారా అనుసరించాల్సిన ఫ్యుహంపై చర్చించారు. బల్దియాపై మళ్ళీ గులాబీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. 


ఎన్నారై టీఆర్ఎస్ ముఖ్య నాయకులు రత్నాకర్ కడుదుల, నరేందర్ రెడ్డి మేడసాని, హరీష్ రంగా, అనీల్ బైరెడ్డి, సందీప్, జై గుండా జై విష్ణు, వెంకట్రావ్ తాల్లపల్లి, సాయికిరణ్  నల్ల ,అనిల్ బైరెడ్డి, నగేష్, రమేష్ బాబు, మారుతి, అరుణ్, శివాంత్ రెడ్డి, చిట్టి, ప్రదీప్, రామక్రిష్ణ, నవీన్ భువనగిరి, సురేష్ గోపతి, సత్య చిలుముల, సాయి తేజ, ప్రశాంత్, వినయ్ ఆకుల, తిరుపతి బొడ్డు, అబ్దుల్, శోభన్ తదితరులు వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. 


Updated Date - 2020-11-23T01:52:22+05:30 IST