Abn logo
Sep 22 2021 @ 19:34PM

రేవంత్ రెడ్డికి దమ్ముంటే "డెవలప్‌మెంట్ ఛాలెంజ్" స్వీకరించాలి: అనిల్ కూర్మాచలం

మంత్రి కేటీఆర్ దేశంలోనే ఆదర్శవంతమైన నాయకుడు 

ఎన్నారై టీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం 

లండన్: ఇటీవల మంత్రి కేటీఆర్‌పై రేవంత్ రెడ్డి చేసిన వాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఎన్నారై టీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం తెలిపారు. జెడ్పీటీసీ, ఎమ్మెల్యే, ఎంపీ అయినా అని చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డి ప్రజలకు ఏం చేశారో చెప్పాలని అనిల్ కూర్మాచలం అడిగారు. ఎంతసేపు పదవులని తన ఎదుగుదలకు ఉపోయోగించుకోవడం తప్పిస్తే, ప్రజల అభివృద్ధికి కృషి చెయ్యలేదని దుయ్యబట్టారు. అందుకే ఎమ్మెల్యేగా ప్రజలు ఓడించి ఇంటికి పంపిన విషయం గుర్తుకు పెట్టుకోవాలని అనిల్ కూర్మాచలం తెలిపారు. మంత్రి కేటీఆర్‌ను విమర్శించే నైతిక హక్కు రేవంత్ రెడ్డికి లేదన్నారు. నేడు చేసుకోవాల్సింది వైట్ ఛాలెంజ్‌లు, బ్లాక్ ఛాలెంజ్‌లు కాదని, దమ్ముంటే "డెవలప్‌మెంట్ ఛాలెంజ్" స్వీకరించి ప్రజాప్రతినిధిగా ఇన్నేళ్లు ఏం చేశావు అనేది ప్రజలకు చెప్పాలని అనిల్ సవాల్ విసిరారు.


రేవంత్ రెడ్డి నాలుగు సభలకే మతిస్థిమితం కోల్పోయి ఆయనేదో దేశానికి అధిపతి అయినట్టు బిల్డప్ ఇస్తున్నాడని, ఆలా అనుకుంటే గత ఇరవై సంవత్సరాలుగా దేశంలోనే బహిరంగ సభలతో చరిత్ర సృష్టించిన ఘనత టీఆర్ఎస్ పార్టీది, కేసీఆర్‌ది అని ఆయన గుర్తు చేశారు. ఒక బాధ్యతగల స్థానంలో ఉండి ప్రభుత్వానికి నిర్మాణాత్మక సలహాలు ఇవ్వాల్సింది పోయి ఎంత సేపు వ్యక్తిగత దూషణలతో ఇప్పటికే ప్రజల్లో చులకనయ్యాడని అన్నారు. ఎన్నారైలు సైతం అసహ్యించుకుంటున్నారని అనిల్ పేర్కొన్నారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి పద్ధతి మార్చుకొని తన సొంత అభివృద్ధి కోసం పని చేసుకోకుండా ప్రజల అభివృధ్ధి కోసం పని చెయ్యాలన్నారు. ఇలాగే మంత్రుల మీద, టీఆర్ఎస్ నాయకుల మీద పిచ్చి పిచ్చి విమర్శలు చేస్తే తప్పకుండా బుద్ది చెప్తామని అనిల్ కూర్మాచలం హెచ్చరించారు.

సత్య నాదెళ్ల ఎవరో కూడా తెలియని జ్ఞానం లేని చరిత్ర నీది, కానీ అదే సత్య నాదెళ్లతో ప్రశంసలందుకున్న చరిత్ర మంత్రి కేటీఆర్‌ది ఇంతకంటే రుజువు ఏం కావాలి ఎవరి స్థాయి ఏందో ప్రజలకు తెలవడానిక అని చూరకలంటించారు. కాబట్టి మాటలు తక్కువ చేసి ప్రజలకు ఉపయోగపడే పని చెయ్యాలని అనిల్ కూర్మాచలం హితవు పలికారు. ప్రపంచంలో నిన్ను నాయకుడిగా ఆదర్శంగా తీసుకునే ఒక్క మనిషి కూడా లేడని ఎందుకంటే నీ చరిత్ర మొత్తం అవినీతి, బ్లాక్‌మెయిల్, పట్ట పగలు దొరికిన ఓటుకు నోటు దొంగవని ప్రపంచానికి తెలుసునని విమర్శించారు. అన్ని చరిత్రలు చెప్పి తన ఓటుకు నోటు దొంగ చరిత్ర మాత్రం చెప్పడం మర్చిపోయిన దొంగ రేవంత్ రెడ్డి అని, మరి దొంగతనం దాచిపెడితే దాగేది కాదని ప్రజలంతా చూస్తున్నారని సరైన సందర్భంలో తగిన  బుద్ది చెప్తారని అనిల్ కూర్మాచలం తెలిపారు. మంత్రి కేటీఆర్ ఆదర్శవంతమైన నాయకుడని దేశం మొత్తం వారి పనితనాన్ని నాయకత్వాన్ని ప్రశంసిస్తుందని చెప్పారు. వారి వెంట క్షేత్రస్థాయి నుండి ప్రపంచస్థాయి కార్యకర్తలు, అభిమానులు ఉన్నారని, భవిష్యత్తులో ఇలాగే విమర్శిస్తే తగిన బుద్ధి చెప్తారని రేవంత్ రెడ్డిని హెచ్చరించారు.


ఇవి కూడా చదవండిImage Caption

తాజా వార్తలుమరిన్ని...