గెల్లు శ్రీనివాస్‌కు టికెట్ ఇచ్చినందుకు కేసీఆర్‌కు థ్యాంక్స్: ఎన్నారై టీఆర్ఎస్ యూకే

ABN , First Publish Date - 2021-08-12T01:39:23+05:30 IST

హుజూరాబాద్ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా తెలంగాణ ఉద్యమంలో విద్యార్థి నాయకుడు, టీఆర్ఎస్ ప్రస్థుత విద్యార్థి విభాగం(టీఆర్ఎస్‌వీ) రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ ఖరారు చేసిన సందర్భంగా ఎన్నారై టీఆర్ఎస్ యూకే అధ్యక్షులు అశోక్ దుసారి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

గెల్లు శ్రీనివాస్‌కు టికెట్ ఇచ్చినందుకు కేసీఆర్‌కు థ్యాంక్స్: ఎన్నారై టీఆర్ఎస్ యూకే

ఉద్యమ విద్యార్థి నాయకుడికి టికెట్ ఇచ్చినందుకు కేసీఆర్‌కు కృతజ్ఞతలు: ఎన్నారై టీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి

లండన్: హుజూరాబాద్ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా తెలంగాణ ఉద్యమంలో విద్యార్థి నాయకుడు, టీఆర్ఎస్ ప్రస్థుత విద్యార్థి విభాగం(టీఆర్ఎస్‌వీ) రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ ఖరారు చేసిన సందర్భంగా ఎన్నారై టీఆర్ఎస్ యూకే అధ్యక్షులు అశోక్ దుసారి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అశోక్ దుసారి మాట్లాడుతూ.. గెల్లు శ్రీనివాస్ యాదవ్ టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచే పార్టీలో అంకితభావంతో పనిచేస్తున్నారని కొనియాడారు. ఉస్మానియా యూనివర్సిటీ టీఆర్ఎస్‌వీ విభాగం అధ్యక్షుడిగా పనిచేసిన గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఉద్యమ కాలంలో అరెస్టై పలుమార్లు జైలు కెళ్లిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. గెల్లు శ్రీనివాస్ క్రమశిక్షణతో కూడిన వ్యక్తిత్వాన్ని, సేవాభావాన్ని, నిబద్దతను గుర్తించిన కేసీఆర్ ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడంతో టీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడు ఉద్యమకారులను ప్రోత్సహిస్తుందని మరోసారి రుజువైందని తెలిపారు. 


ఎన్నారై టీఆర్ఎస్ ఇప్పటికే అటు సోషల్ మీడియాతో పాటు ఇటు ఎన్నారై టీఆర్ఎస్ యూకే నాయకులు క్షేత్రస్థాయిలో టీఆర్ఎస్ గెలుపు కోసం హజూరాబాద్‌లో ప్రచారం నిర్వహించారు. అలాగే ఎన్నారై టీఆర్ఎస్ ప్రత్యేక కార్యాచరణతో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలుపు కోసం నియోజకవర్గంలో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తామని, టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపుకు కృషిచేస్తామని అశోక్ చెప్పారు. ఈ సందర్భంగా ఎన్నారై టీఆర్ఎస్ తరఫున, ఎన్నారైల పక్షాన కేసీఆర్‌కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. అంతేగాక గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలుపు కోసం ప్రతిఒక్కరు కృషి చేయ్యాలని కోరారు.

Updated Date - 2021-08-12T01:39:23+05:30 IST