Advertisement
Advertisement
Abn logo
Advertisement

మృతుడి కుటుంబానికి ఎన్నారై టీఆర్ఎస్ యూఎస్ఏ బాసట

అగ్ని ప్రమాదంలో మరణించిన దేవేందర్ కుటుంబ సభ్యులకు బాసటగా నిలిచిన ఎన్నారై టీఆర్ఎస్ యూఎస్ఏ 

హైదరాబాద్‌: అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రం ఎడిసన్ నగరంలో జనవరిలో జరిగిన అగ్ని ప్రమాదంలో టీఆర్ఎస్ యూఎస్ సభ్యుడు నల్లమడ దేవేందర్ మరణించారు. దేవేందర్ అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేసే వారు. ఈయన స్వస్థలం నల్గొండ జిల్లా దేవరకొండ. దేవేందర్ అకాల మరణంతో వారి కుటుంబానికి తీవ్ర అన్యాయం జరిగిందని చింతిస్తూ టీఆర్ఎస్ యూఎస్ఏ సభ్యులు మహేష్ తన్నీరు, శ్రీనివాస్ గనగోని, చందు తాళ్ల, పూర్ణ బైరి, వెంగల్ జలగం, అరవింద్ తక్కళ్లపల్లి, నరసింహ నాగులవంచ, సక్రు నాయక్, మహేష్ పొగాకు, హరిందర్ తాళ్లపల్లి, వారి మిత్రులు టోనీ జన్ను, రిషికేష్ రెడ్డి, వ్యాల్ల హరీష్ రెడ్డి, కళ్యాణ్ చక్రవర్తి, శ్రీనివాస్ సురభి, మోహిత్ కర్పూరం, నవీన్ కానుగంటి, రజినీకాంత్ కూసానం బాసటగా నిలిచారు. ఈ మేరకు ఎన్నారై టీఆర్ఎస్ యూఎస్ఏ చైర్మన్ తన్నీరు మహేష్, సభ్యులు నవీన్ జలగం, శశి దొంతినేని హైదరాబాద్‌లోని దేవేందర్ తల్లి భారతమ్మను కలిసి పరామర్శించి ప్రగాఢ సంతాపం తెలిపారు. అలాగే వారికి రూ. 7,18,000/- ఆర్థిక సహాయాన్ని డీడీ ద్వారా అందజేశారు. ఈ సందర్భంగా తన్నీరు మహేష్ బాధిత కుటుంబ సభ్యులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.


Advertisement

తాజా వార్తలుమరిన్ని...

Advertisement