ఒడిశా కూలీలకు బస్సు ఏర్పాటు చేసిన ఎన్నారైలు

ABN , First Publish Date - 2020-05-28T21:28:17+05:30 IST

ఒడిశాకు చెందిన వలస కూలీల కోసం వివిధ దేశాల్లో స్థిరపడిన ఎన్నారైలు

ఒడిశా కూలీలకు బస్సు ఏర్పాటు చేసిన ఎన్నారైలు

హైదరాబాద్: ఒడిశాకు చెందిన వలస కూలీల కోసం వివిధ దేశాల్లో స్థిరపడిన ఎన్నారైలు హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సును ఏర్పాటు చేశారు. టీపీసీసీ పిలుపు మేరకు తెలంగాణకు చెందిన ఎన్నారైలు ఈ కార్యక్రమంలో పాలుపంచుకునేందుకు ముందుకొచ్చారు. ఎన్నారైలు ఏర్పాటు చేసిన బస్సును రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్, టీపీసీసీ ఎన్నారై సెల్ అధ్యక్షుడు వినోద్‌లు జెండా ఊపి ప్రారంభించారు. దాదాపు  1400 కిలోమీటర్ల  దూర ప్రయాణానికి కావాల్సిన  అన్ని ఏర్పాట్లు  చేశారు. బస్సు బయలుదేరే ముందు వలస కార్మికులతో టీపీసీసీ నేతలు సమావేశం నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి తమకు ఎటువంటి సహాయం అందలేదని.. ఇదే దేశంలో పుట్టిన తమను పట్టించుకోకపోవడం దారుణమని వలస కార్మికులు వాపోయారు. కాగా.. ఒడిశాతో పాటు ఉత్తర ప్రదేశ్‌కు చెందిన వలస కూలీల కోసం ఎన్నారైలు వచ్చే వారం మరో బస్సును ఏర్పాటు చేయనున్నారు. గత 50 రోజుల్లో కాంగ్రెస్ పార్టీ  తరపున యూకే, ఆస్ట్రేలియా, దుబాయ్‌లలోని ఎన్నారైలు ఆయా దేశాల్లో ఇబ్బందుల్లో ఉన్న తెలుగు వారికి అండగా నిలబడుతూ వస్తున్నారు. విద్యార్థులకు, కార్మికులకు వసతి కల్పించడం, నిత్యావసర సరుకులు అందించడం, ఆహారం అందించడం, ఇండ్ల  కిరాయిలు కట్టడం వంటి కార్యక్రమాలను ఎన్నారైలు చేపడుతున్నారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న 600 మందికి పైగా తాము సహాయం చేసినట్టు ఎన్నారైలు తెలిపారు. 


బస్సు ఏర్పాటుకు సహకరించిన ఎన్నారైలు వీరే:

1) గంప వేణుగోపాల్  - లండన్

2) గంగసాని రాజేశ్వర్ రెడ్డి  - అమెరికా

3) యర్రంరెడ్డి  తిరుపతి రెడ్డి  - అమెరికా

4) మన్యం రాజశేఖర్ రెడ్డి  - ఆస్ట్రేలియా  

5)  ఎస్ వి రెడ్డి  - దుబాయ్

6) ప్రదీప్ సామల  - అమెరికా

7) గంగసాని ప్రవీణ్  రెడ్డి  -లండన్

8) రవీందర్ గౌడ్  - కెనడా

9) కొత్త రామ్మోహన్ రెడ్డి  - లండన్

10) సుధాకర్ గౌడ్  - లండన్

11) బిక్కుమండ్ల రాకేష్  -లండన్

12) నీలా శ్రీధర్  - లండన్

13) పోటాటి శ్రీకాంత్  రెడ్డి  -లండన్

Updated Date - 2020-05-28T21:28:17+05:30 IST