ఎన్నారైలు ఆలోచించి ఓటేయాలి: బుచ్చి రామ్‌ప్రసాద్‌

ABN , First Publish Date - 2021-03-01T13:06:21+05:30 IST

మున్సిపల్‌ ఎన్నికల్లో ఓటు వేసే ముందు ఎన్‌ఆర్‌ఐలు ఆలోచించుకోవాలని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బుచ్చి రామ్‌ప్రసాద్‌ కోరారు. ఆది వారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ‘ఏపీలో ఎన్నారై ఆస్తులకు రక్షణ లేకుండా పోయింది. ప్రవాసాంధ్రుల

ఎన్నారైలు ఆలోచించి ఓటేయాలి: బుచ్చి రామ్‌ప్రసాద్‌

అమరావతి, ఫిబ్రవరి 28(ఆంధ్రజ్యోతి): మున్సిపల్‌ ఎన్నికల్లో ఓటు వేసే ముందు ఎన్‌ఆర్‌ఐలు ఆలోచించుకోవాలని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బుచ్చి రామ్‌ప్రసాద్‌ కోరారు. ఆది వారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ‘ఏపీలో ఎన్నారై ఆస్తులకు రక్షణ లేకుండా పోయింది. ప్రవాసాంధ్రులను పరాయి బిడ్డలుగా చూస్తున్నారు. 21 నెలల్లో జగన్‌రెడ్డి జే ట్యాక్స్‌ కోసం ఎన్నారైలను అన్ని విధాలా వేధించారు. జే ట్యాక్స్‌కు భయపడి, ఏపీలో పెట్టుబడులు పెట్టడం లేదు. హ్యాపీనెస్ట్‌ ఆపేసి, ఎన్నారైలను ఇబ్బందులకు గురి చేశారు. చంద్రబాబు హయాంలో ఐటీ కేంద్రాలుగా విరాజిల్లిన విజయవాడ, విశాఖ, మంగళగిరి, తిరుపతి నగరాలు నేడు వెలవెలబోతున్నాయి. జగన్‌ ప్రభుత్వం రాయితీలు, ప్రోత్సాహకాలు నిలిపివేయడంతో ఐటీ కంపెనీలు హైదరాబాద్‌ బాట పట్టాయి. అందువల్ల మున్సిపల్‌ ఎన్నికల్లో ఓటు వేసే ముందు ఆలోచించుకోవాలి. మీరేసే ఓటుతో జగన్‌రెడ్డికి బుద్ధి రావాలి’ అని బుచ్చిరామ్‌ప్రసాద్‌ సూచించారు. 

Updated Date - 2021-03-01T13:06:21+05:30 IST