Abn logo
Sep 24 2021 @ 22:32PM

ఎన్‌ఎస్‌ఎస్‌ ఆవిర్భావ దినోత్సవం

హుస్నాబాద్‌ ప్రభుత్వ కళాశాలలో మొక్కను నాటుతున్న ప్రిన్సిపాల్‌ రాంచంద్రారెడ్డి

సిద్దిపేట ఎడ్యుకేషన్‌, సెప్టెంబరు 24: స్థానిక ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో శుక్రవారం జాతీయ సేవా పథకం  దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఎన్‌ఎ్‌సఎస్‌ ఆవశ్యకతను ప్రిన్సిపాల్‌ ప్రియాంక విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో ఎన్‌ఎ్‌సఎ్‌స అధికారి సామ సువర్ణాదేవి,  అకడమిక్‌ కో ఆర్డినేటర్‌ కిషోర్‌, ఐక్యూఏసీ కో ఆర్డినేటర్‌ హరిప్రసాద్‌, అధ్యాపకులు వెంకన్న జ్యోతి, గోదావరి చంద్‌ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్‌ఎ్‌సఎ్‌స యూనిట్‌ ఆధ్వర్యంలో వ్యవస్థాపక దినోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ప్రసాద్‌, వైస్‌ ప్రిన్సిపాల్‌, ఎన్‌ఎ్‌సఎ్‌స ప్రోగ్రాం అధికారులు డాక్టర్‌ హుస్సేన్‌, డాక్టర్‌ ప్రసాద్‌, డాక్టర్‌ అయోధ్యరెడ్డి, మల్లేశం, నిర్మలాకుమారి, డాక్టర్‌ శ్రద్ధానందం, బైరయ్య పాల్గొన్నారు.

హుస్నాబాద్‌: పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాలలో ఎన్‌ఎ్‌సఎస్‌ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ నల్ల రాంచంద్రారెడ్డి, ఎన్‌ఎ్‌సఎస్‌ ప్రోగ్రాం ఆఫీసర్‌ కరుణాకర్‌, అధ్యాపకులు సత్తమ్మ, రవీందర్‌, వరూధిని, లక్ష్మయ్య, స్వరూప, రాజేంద్రప్రసాద్‌, పద్మ, భాగ్యలక్ష్మి, గట్టవ్వ పాల్గొన్నారు. 

గజ్వేల్‌టౌన్‌: పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్‌ఎ్‌సఎ్‌స దినోత్సవం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఏ.శ్రీనివా్‌సరెడ్డి, ఎన్‌ఎ్‌సఎ్‌స ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్‌ రమే్‌షబాబు, డాక్టర్‌ అడవి రాజు, బాలస్వామి, శ్రవణ్‌, డాక్టర్‌ నాగేంద్ర జగన్‌, భవాని, రజనీష్‌, సాయి కొండల్‌, మార్కండేయ పాల్గొన్నారు.