మెరుగైన సేవలకు ఎన్‌ఎస్‌టీఎల్‌ నిరంతరం కృషి

ABN , First Publish Date - 2021-10-23T04:30:07+05:30 IST

రక్షణ రంగానికి నాణ్యత ప్రమాణాలతో కూడిన మెరుగైన సేవలు అందించే దిశగా ఎన్‌ఎ్‌సటీఎల్‌ నిరంతరం కృషి చేస్తోందని ఆ సంస్థ డైరెక్టర్‌ ఆఫ్‌ క్వాలిటీ, రిలైబులిటీ అండ్‌ సేఫ్టీ అధికారి రంజిత్‌ సింగ్‌ అన్నారు.

మెరుగైన సేవలకు ఎన్‌ఎస్‌టీఎల్‌ నిరంతరం కృషి
సదస్సును ప్రారంభిస్తున్న ఎన్‌ఎ్‌సటీఎల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ వై.శ్రీనివాసరావు

గోపాలపట్నం, అక్టోబరు 22: రక్షణ రంగానికి నాణ్యత ప్రమాణాలతో  కూడిన మెరుగైన సేవలు అందించే దిశగా ఎన్‌ఎ్‌సటీఎల్‌ నిరంతరం కృషి చేస్తోందని ఆ సంస్థ డైరెక్టర్‌ ఆఫ్‌ క్వాలిటీ, రిలైబులిటీ అండ్‌ సేఫ్టీ అధికారి రంజిత్‌ సింగ్‌ అన్నారు. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ కార్యక్రమంలో భాగంగా డీఆర్‌డీవో సారథ్యంలో ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ క్వాలిటీ అండ్‌ రిలైబులిటీ (పుణే) సహకారంతో ఎన్‌ఎ్‌సటీఎల్‌లో రిలైబులిటీ ఇంజనీరింగ్‌పై రెండు రోజుల కోర్సును శుక్రవారం ప్రారంభించారు. ఆ సంస్థ డైరెక్టర్‌ డాక్టర్‌ వై.శ్రీనివాసరావు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. నేవల్‌ సిస్టమ్స్‌ అండ్‌ మెటీరియల్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ సమీర్‌ వి కామత్‌, డైరెక్టర్‌ ఆఫ్‌ క్వాలిటీ, రిలైబులిటీ అండ్‌ సేఫ్టీ అధికారి రంజిత్‌ సింగ్‌లు మాట్లాడుతూ నాణ్యత ప్రమాణాలకు ప్రాధాన్యం ఇస్తూ ప్రపంచస్థాయి జలాంతర ఆయుధ రూపకల్పనలో ఎన్‌ఎ్‌సటీఎల్‌ అనుసరిస్తున్న విధానాలు అభినందనీయమని కొనియాడారు. ఇటువంటి కోర్సులు యువ శాస్త్రవేత్తల్లో మరింత అవగాహన పెంచడానికి ఎంతో దోహద పడుతుందని అన్నారు. కార్యక్రమంలో శాస్త్రవేత్తలు బీవీఎ్‌సఎస్‌ కృష్ణ కుమార్‌,  ఇతర అధికారులు, ఎన్‌ఎ్‌సటీఎల్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ అండ్‌ వర్క్స్‌ కమిటీ సభ్యులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-23T04:30:07+05:30 IST