పాజిటివ్ వచ్చినవారు 6 నెలల తర్వాత టీకా తీసుకోవాలి: ఎన్‌టీఏజీఐ

ABN , First Publish Date - 2021-05-13T17:50:59+05:30 IST

టీకాలపై జాతీయ ఇమ్యునైజేషన్ సాంకేతిక సలహా బృందం (ఎన్‌టీఏజీఐ) పలు సూచనలు చేసింది.

పాజిటివ్ వచ్చినవారు 6 నెలల తర్వాత టీకా తీసుకోవాలి: ఎన్‌టీఏజీఐ

న్యూఢిల్లీ: టీకాలపై జాతీయ ఇమ్యునైజేషన్ సాంకేతిక సలహా బృందం (ఎన్‌టీఏజీఐ) పలు సూచనలు చేసింది. కరోనా పాజిటివ్ వచ్చినవారు 6 నెలల తర్వాత టీకా తీసుకోవాలంది. గర్భిణి మహిళలు అయితే ప్రసవం తర్వాత టీకా ఎప్పుడైనా తీసుకోవచ్చునని చెప్పింది. కొవిషీల్డ్ వ్యాక్సిన్ తొలి, రెండో విడత మధ్య గ్యాప్ ఉండాలని, 12-16 వారాల మధ్య కొవిషీల్డ్ రెండో డోసు వ్యాక్సిన్ తీసుకోవాలంది. ప్రస్తుతం కొవిషీల్డ్ డోసుల గడువు 6 నుంచి 8 వారాలు ఉంటోందని, కొవాగ్జిన్ డోసుల మధ్య గడువు యథావిధిగా ఉంచాలని ఎన్‌టీఏజీఐ సూచించింది.

Updated Date - 2021-05-13T17:50:59+05:30 IST