ఎన్టీఆర్‌పై తూష్ణీభావమా?

ABN , First Publish Date - 2020-11-28T06:57:08+05:30 IST

ఒక మనిషి ఏ ప్రాంతంలో పుట్టాడు, ఏ కులంలో, ఏ మతంలో పుట్టాడు అనే వాటి కంటే ఆ మనిషి తన జీవితకాలంలో సమాజం శ్రేయస్సుకి ఎంతగా పాటుబడ్డాడు, తన ఆశయాలతో, ఆచరణలతో..

ఎన్టీఆర్‌పై తూష్ణీభావమా?

ఒక మనిషి ఏ ప్రాంతంలో పుట్టాడు, ఏ కులంలో, ఏ మతంలో పుట్టాడు అనే వాటి కంటే ఆ మనిషి తన జీవితకాలంలో సమాజం శ్రేయస్సుకి ఎంతగా పాటుబడ్డాడు, తన ఆశయాలతో, ఆచరణలతో ఎన్ని తరాలకు ఆదర్శవంతమైన స్ఫూర్తిని నింపాడు అనేదే ముఖ్యం. అలా భావితరాలకు స్ఫూర్తినిచ్చే జీవితాన్ని గడిపిన మహానుభావులు స్వర్గస్తులైన తరువాత, వారి సమాధులను జ్ఞాపక మందిరాల్లా, స్ఫూర్తిని వెదజల్లే స్థూపాలుగా మలచుకుని సంస్మరించుకోవడం మన సంప్రదాయం. ఇలా మనం సంస్మరించుకునే మహనీయులలో నందమూరి తారక రామారావు ఒకరు. ‘ఆత్మ గౌరవం’ నినాదంతో రాజకీయాల్లోకి ప్రవేశించి, ‘తెలుగు జాతి’లో ఒక మహత్తర రాజకీయ చైతన్యాన్ని తీసుకొచ్చి అప్పటిదాకా ‘మదరాసీ’లుగా పిలవబడుతున్న ‘తెలుగుజాతి’కి దేశంలోనూ, విశాల ప్రపంచంలోనూ ఒక ప్రత్యేక గుర్తింపు సాధించిన మహానాయకుడు ఎన్టీఆర్. ‘తెలుగువాడు’ ఏ ప్రాంతానికి చెందిన వాడైనా ఏ యాస, ఏ బాసల వాడైనా ప్రపంచంలో ఎక్కడకు వెళ్ళి స్థిరపడ్డా ‘తెలుగువాడే’ అంటూ ‘తెలుగుజాతి మనది, నిండుగ వెలుగు జాతి మనది’ అన్న స్ఫూర్తిని నింపారు. ‘తెలుగుజాతి’కి ఇంత ఖ్యాతిని, ఇంత చైతన్యాన్ని, ఇంత స్ఫూర్తిని ఇచ్చిన ఆ మహానుభావుడినే టార్గెట్‌ చేస్తున్నారంటే, ఇంక ఈ నాయకుల మానసిక దౌర్బల్యాన్ని మనం ఏమనుకోవాలి!! ప్రజల్ని గోవులు, గొర్రెలు అనుకుంటే గతులు మారిపోతాయని ఎన్టీఆర్ స్మృతిని అవమానిస్తున్న నేటి రాజకీయ నాయకులు గుర్తుంచుకోవాలి. వాళ్లు అసహనాన్ని విడనాడి సంయమనం పాటించాలి.


వైవిఎస్‌ చౌదరి

సినీ నిర్మాత, దర్శకుడు

Updated Date - 2020-11-28T06:57:08+05:30 IST